Emergency : ఆపద సమయంలో మనం ఫోన్ చేయాల్సిన నెంబర్లేమిటో తెలుసా?
Emergency : మనదేశంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. వేగ నిరోధకాన్ని పాటించకుండా మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడు 1073 నెంబర్ కు డయల్ చేస్తే వారు వచ్చి క్షణాల్లో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తారు. మనదేశంలో సమయానికి వైద్యం అందక చాలా మంది చనిపోతున్నారు. ఈనేపథ్యంలో ఈ టోల్ ఫ్రీ నెంబర్ ను ఉపయోగించుకుని కాల్ చేస్తే వెంటనే సహాయక చర్యలు అందుతాయి.
ఈ రోజుల్లో ఆన్ లైన్ మోసాలు పెరుగుతున్నాయి. అనుకోకుండా మన ఖాతా నుంచి డబ్బులు మాయం కావడం వంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో మనం వెంటనే అప్రమత్తమై 1930కు కాల్ చేస్తే సైబర్ క్రైం పోలీసులు రంగంలోకి దిగి మోసం ఎక్కడ జరిగిందో గుర్తిస్తారు. పోయిన మన డబ్బును తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు.
మనకు ఏదైనా పని కావాలంటే లంచం అడిగే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. దీన్ని అవినీతి నిరోధక శాఖ అడ్డుకుంటుంది. ఏపీలో 14440, తెలంగాణలో 1064 నెంబర్ల ద్వారా మనం ఎవరైనా లంచం అడిగితే ఫిర్యాదు చేయవచ్చు. వారే రంగంలోకి దిగి అవినీతి పరుల దిమ్మ దించుతారు. అవినీతిపరుల అంతం చూస్తారు. ఏ అధికారైనా వారి ఆగడాలను అడ్డుకుని తీరుతారు.
మనం ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తే అది వెంటనే పాడైపోతే దాన్ని కూడా మనం ఫిర్యాదు చేయవచ్చు. నేషనల్ కన్జుమర్ హెల్ప్ లైన్ (ఎన్ సీహెచ్)కు కంప్లైంట్ చేసుకోవచ్చు. 1915 నెంబర్ కు కాల్ చేసి మనకు జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తే వారు విచారణ చేసి మనకు న్యాయం చేస్తారు. ఇలా ఈ నెంబర్లను మన దగ్గర ఉంచుకుని ఆపద జరిగిన సమయాల్లో ఫిర్యాదు చేసి తగిన న్యాయం పొందవచ్చని చెబుతున్నారు.