Viral Video : ముద్రగడకు నూతన నామకరణ మహోత్సవం..నవ్వులు పూయిస్తున్న వీడియో

Viral Video
Viral Video : ఏపీలో కూటమి ఘన విజయం సాధించడంతో ప్రపంచవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టడానికి ప్రధాన కారకుడైన పవన్ కల్యాణ్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. కూటమి సునామీకి కారణమైన పవన్ ను మ్యాన్ ఆఫ్ మ్యాచ్ గా విశ్లేషకులు సైతం అభివర్ణిస్తున్నారు. వైసీపీని పాతాళానికి తొక్కుతా..అని గతంలో పవన్ వార్నింగ్ ఇచ్చినట్టుగానే..టీడీపీతో పొత్తు పెట్టుకుని, కూటమిలోకి బీజేపీని తీసుకొచ్చి వైసీపీకి మరణశాసనాన్ని రాశారు.
ఇదిలా ఉంటే.. పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానంటూ శపథం చేసిన కాపునేత ముద్రగడపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన ముద్రగడ… పవన్ కళ్యాణ్ కు ఆ సవాల్ విసిరారు. ఇప్పుడు పవన్ పిఠాపురంలో గెలవడమే కాకుండా అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు పోటీచేసిన అన్ని స్థానాల్లో 100శాతం ఫలితం సాధించడంతో నెటిజన్లు ఆయనను టార్గెట్ చేసుకున్నారు. మరోవైపు, 175కి 175 స్థానాల్లో పోటీచేసిన వైసీపీ కేవలం 11 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
పిఠాపురంలో పవన్ గెలిచిన తర్వాత ముద్రగడ సోషల్ మీడియాకు టార్గెట్ అయ్యారు. మరీ ముఖ్యంగా జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు ఆయనకు నామకరణ మహోత్సవం పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముద్రగడ ఫొటో ముందు అరటిపండ్లు, కేక్ పెట్టి పద్మనాభరెడ్డి అంటూ మూడుసార్లు ఫొటోలోని చెవి వద్ద ఊది కొత్త పేరు పెట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియో నవ్వులు పూయిస్తుండడంతో ప్రతీ ఒక్కరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక కొందరు నెటిజన్లు ఇకనుంచైనా ముద్రగడ పద్మనాభం కులం పేరుతో అధినేతల నుంచి అమ్యామ్యాలు తీసుకోకుండా తమ కులం వాడైన పవన్ కు మద్దతుగా నిలిచి పెద్దరికం కాపాడుకోవాలని అంటున్నారు. పవన్ భవిష్యత్ లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టేందుకు సహకరించాలని.. లేదంటే చరిత్ర మిమ్మల్ని క్షమించదని హెచ్చరిస్తున్నారు.