Mega Daughter In Law : ఆడబిడ్డ కాపురాన్ని బాగు చేస్తున్న కొత్త కోడలు..

Mega Daughter In Law

Mega Daughter In Law

Mega Daughter In Law : ప్రొడక్షన్‌లో, నటిగా కూడా రాణిస్తున్న నిహారిక కొణిదెల దాంపత్య జీవితం మాత్రం ఇబ్బందుల్లో పడింది. వివాహం జరిగిన కొంత కాలానికే తన భర్త చైతన్యతో విడిపోయింది. ఆమె వైవాహిక జీవితాన్ని సరిచేయాలని కొత్త కోడలు లావణ్య త్రిపాఠి నిర్ణయించుకుందట. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.

లావణ్య త్రిపాఠిది గోల్డెన్ లెగ్ అని మెగా ఫ్యామిలీ భావిస్తున్నారట. రాం చరణ్ కు బిడ్డ, చిరంజీవి వల్తేరు వీరయ్య హిట్ వచ్చిందని అనుకుంటున్నారు మెగా ఫ్యాన్స్. కొత్త కోడలుకు మంచి మార్కులే వేస్తున్నారు మెగా ఫ్యాన్స్.

ఇక నిహారిక విషయానికి వస్తే జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకున్న ఆమె కొన్నాళ్లకే విడిపోయింది. తర్వాత కెరీర్ పైనే దృష్టి పెట్టాలని భావిస్తోందట. ప్రొడక్షన్ హౌజ్ ప్రారంభించిన ఆమె మంచి మంచి సినిమాలు చేసేందుకు కమిట్ అయ్యిందట. కొన్నింటికి ఇప్పటికే సైన్ చేయగా.. మరికొన్నింటి చర్చలు నిర్వహిస్తుందట. నిర్మాతగా నిహారిక సక్సెస్ అయ్యిందనే చెప్పవచ్చు.

ఇటీవల జరిగిన అన్న వివాహ వేడుకల్లో నిహారిక సందడి చేశారు. నిశ్చితార్థం నుంచి వివాహం ముగిసే వరకు అన్ని సన్నివేశాల్లో అన్నా, వదినతో కనిపించారు. తన పెళ్లిని పండుగలా చేసేందుకు సహకరించిన నిహారికకు లావణ్య త్రిపాఠి ధన్యవాదాలు చెప్పారట.

ఎక్కువ రోజులు ఒంటరిగా ఉండవద్దని ఆడబిడ్డకు మంచి లైఫ్ ఇవ్వాలని అనుకుంటుందట. ఇంటికి వచ్చిన కొత్తలోనే ఇంత బాధ్యతగా వ్యవహరించడంపై మెగా ఫ్యాన్స్ సంబురపడిపోతున్నారట. ఇక నిహారికా విషయానికస్తే నిర్మాతగా దూసుకెళ్తున్న ఆమె హీరోయిన్ గా వచ్చేందుకు ఇష్టపడడం లేదని తెలుస్తోంది. మరీ అంత అవసరం అనిపిస్తే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తానని చెప్తుందట.

TAGS