Nagarjuna : ఇటీవల ముంబై విమానాశ్రయంలో తన బాడీగార్డ్ ద్వారా నెట్టివేయబడిన అభిమానిని కలుసుకున్నారు టాలీవుడ్ కింగ్ నాగార్జున. ముంబై విమానాశ్రయం నుంచి హైదరాబాద్ వస్తుండగా అతడిని కలుసుకొని హగ్ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. దీంతో ఆ అభిమాని ఆనందంలో మునిగిపోయాడు.
ప్రస్తుతం నాగార్జున ముంబైలో కుబేర అనే మూవీ చేస్తున్నారు. ఈ క్రమంలో ముంబై ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వస్తున్న నాగార్జునను కలిసేందుకు ఈ అభిమాని ముందుకు వచ్చాడు. అయితే దీనిని గమనించిన నాగ్ బాడీగార్డ్ అతన్ని పక్కకు నెట్టేశాడు. దీంతో అతను పడిపోయాడు. ఈ విషయం నాగ్ దృష్టికి రాలేదు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ట్విట్టర్ వేదికగా స్పందించారు నాగార్జున. క్షమాపణలు చెపుతూ భవిష్యత్తులో ఇలాంటి తప్పు జరగదని ట్వీట్ చేశారు.