Venkatesh Saindhav : విక్టరీ వెంకటేష్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్స్ గా నిలవడం చాలా తక్కువ సార్లు చూస్తుంటాము. ఆయనకీ ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్ కారణంగా తన సినిమాకి డివైడ్ టాక్ వచ్చినా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద రికవరీ చేసేస్తూ ఉంటాడు. ఇది వరకు ఎన్నో సినిమాలకు అలా చేసాడు కూడా. అలాంటి వెంకటేష్ ‘సైంధవ్’ చిత్రాన్ని మాత్రం సూపర్ హిట్ చెయ్యలేకపోయాడు. ఇదే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం.
సంక్రాంతికి వెంకటేష్ సినిమా వచ్చిందంటే ఒకప్పుడు థియేటర్స్ ముందర జాతరలాగా ఉండేది. ఫ్యామిలీ ఆడియన్స్ మరియు లేడీస్ థియేటర్స్ వైపు బారులు తీస్తారు. కానీ ఎంత మంచి ఫ్యామిలీ ఇమేజి ఉన్న హీరో అయినా, సీజన్ కి తగ్గట్టుగా సినిమాలు విడుదల చెయ్యాలి. సంక్రాంతి సీజన్ లో ఆడియన్స్ ఎక్కువగా కమర్షియల్ సినిమాలు, ఎంటర్టైన్మెంట్ సినిమాలు చూసేందుకు ఇష్టపడుతూ ఉంటారు. స్టార్ హీరోలందరూ అలాంటి సినిమాలు సంక్రాంతికి విడుదల చెయ్యడానికి ఆసక్తి చూపిస్తారు.
కానీ వెంకటేష్ మాత్రం ఈసారి తన స్ట్రాంగ్ జోన్ కి దూరంగా ‘సైంధవ్’ లాంటి యాక్షన్ మూవీ తో మన ముందుకు వచ్చాడు. టాక్ కూడా ఈ చిత్రానికి అనుకున్నంత రేంజ్ లో రాలేదు. దీంతో ఆడియన్స్ ఎవ్వరూ కూడా ఈ చిత్రాన్ని చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఫలితంగా గత రెండు దశాబ్దాల చరిత్ర లో వెంకటేష్ ఎప్పుడూ చూడని డిజాస్టర్ ఫ్లాప్ ని ఈ సినిమా ద్వారా చూడాల్సి వచ్చింది. ఈ చిత్రం లో నటించేందుకు వెంకటేష్ దాదాపుగా 10 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని తీసుకున్నాడు. కానీ ఇప్పటి వరకు ఈ చిత్రానికి కనీసం 8 కోట్ల రూపాయిల వసూళ్లు కూడా రాలేదు.
ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి పాతిక కోట్ల రూపాయలకు జరిగింది. కానీ ఈ సినిమా కి ఈ వారమే చివరి రన్. తర్వాత ఇక షేర్ వసూళ్లు వచ్చే అవకాశం కనిపించడం లేదు. ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం ఈ సినిమాకి ఫుల్ రన్ లో 12 కోట్ల రూపాయిల షేర్ కి మించి ఒక్క రూపాయి కూడా వచ్చే అవకాశం లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. అదే కనుక జరిగితే వెంకటేష్ కెరీర్ లో ‘సైంధవ్’ చిత్రం ఒక మాయని మచ్చ లాగ మిగిలిపోతుంది.