Singapore : మునుషుల్లో రాక్షసి ఆ ఓవర్.. సింగపూర్ పని మనిషి వ్యవహారంలో.. ఒళ్లు జలదరించే నిజాలు..
JAISW
Singapore
Singapore : కొన్ని యధార్థ సంఘటనల గురించి తెలుసుకుంటే ఒళ్లు జలదరిస్తుంది. మనుషుల్లో కూడా మృగాలు ఉన్నాయని పిస్తుంది. ఇలాంటి వారు మన ఇరుగు పొరుగున ఉన్నారంటేనే సిగ్గుతో తలదించుకోవాలి. ఒక సంఘటనలో కఠోర వాస్తవాలు బయటకు రావడంతో జడ్జి సైతం విస్తుపోయాడు. దోషిని ఒక్క సారి కాదు.. మళ్లీ మళ్లీ చంపాలని తీర్పు చెప్పాడు.
చెల్లెలు, కొడుకుకు చదువు చెప్పించాలి.. మంచి తిండి పెట్టాలి అందుకు బాగా కష్టపడాలని అనుకుంది పియాంగ్. సొంత ఊరు మయన్మార్ ను వదిలి పని కోసం సింగపూర్ వెళ్లింది. తన ఊర్లో పని చేసుకుంటే తక్కువ డబ్బులు వస్తాయి వీటితో వారికి చదువు చెప్పించడం.. బాగా చూసుకోవడం కుదరదనుకంది. అందుకే సింగపూర్ వెళ్లాలని నిర్ణయించుకుంది.
మొదట ఆమెకు కన్ స్ట్రక్చన్ ఫీల్డ్ లో వర్క్ దొరికింది. కానీ వచ్చిన డబ్బులు తక్కువే ఎక్కువగా భోజనానికే ఖర్చయ్యేది. దీంతో ఇళ్లలో పనిచేస్తే తిండి పెడతారు, డబ్బులు ఇస్తారు. కాబట్టి పొట్ట నిండుతుంది.. డబ్బులు మొత్తం ఇంటికి పంపించవచ్చు అనుకుంది.
దీంతో సింగపూర్ గాయత్రి దేవి అనే వారి ఇంట్లో పనికి కుదిరింది. మొదటి నెల జీతం బాగానే ఇచ్చారు. కానీ ఏదైనా తప్పు జరిగితే తిడుతూ ఉండేవారు. దీనికి తోడు ఆమెకు సిటీ కల్చర్ కొత్త కాబట్టి ఇబ్బంది పడేది. సింగపూర్ గాయత్రి దేవితో పాటు ఆమె భర్త, ఆమె తల్లి కూడా తిడుతుండేవారు.
కొన్ని రోజులు తిట్ల పురాణం కొనసాగిన తర్వాత.. కొట్టడం వరకు వెళ్లారు. జీతం సరైన సమయానికి ఇస్తున్నారన్న కారణంతో ఇక్కడే పని చేయాలని అనుకుంది. ఒకసారి బట్టలు ఇస్త్రీ చేస్తూ ఏదో పొరపాటు చేసిందని అదే వేడి వేడి ఇస్త్రీ పెట్టతో కాల్చింది గాయత్రి దేవి. గాయత్రి సైకో లాగా ఉండేది. ఇంట్లో వాళ్లే కాదు పక్కింట్లో ఉన్న బంధువు కూడా వచ్చి పియాంగ్ ను తిట్టేవారు, చాలా సార్లు కొట్టేవారు కూడా.
ఇంకా వారి ఆగడాలు శృతిమించి పోయాయి. ఎంతలా అంటే పియాంగ్ ను ఆటోమెటిక్ గొలుసులతో కట్టేసేవారు. పాస్వర్డ్ తెలిస్తే మాత్రమే ఓపెన్ అయ్యేవి. వారి హింసలను నోరు మెదపకుండా భరించేది. తిండి కూడా పెట్టేవారు కాదు. పాచిపోయిన భోజనమే తినాలని చెప్పేవారు. దీంతో ఆమె 24 కిలోల బరువు తగ్గింది. ఒకరోజు కిచన్ గదిలో ఆమెను కట్టివేయడంతో కిటికీ ఊసలకు వేలాడుతూ కనిపించింది. దీంతో గాయత్రీ దేవి డాక్టర్ కు ఫోన్ చేసింది.
డాక్టర్ వచ్చి పియాంగ్ ను చూసి, ఆమె ఒంటిపై ఉన్న గాయాలను పరిశీలించి షాక్ కు గురయ్యాడు. అప్పటికే ఆమె చనిపోయి ఉంది. తెలివిగా ప్రవర్తించిన డాక్టర్ పోలీసులకు సమాచారం ఇస్తేనే ట్రీట్మెంట్ చేస్తానని చెప్పి పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు రావడంతోనే ఆమె చనిపోయిందని, వీళ్లే కొట్టి చంపారని ఫిర్యాదు చేశాడు. పియాంగ్ ఒంటి మీద ఉన్న గాయాలు అన్నిటినీ పరిశీలించి దీనికి ఒడిగట్టిన గాయత్రీ దేవిని గొలుసులతో కట్టేసి ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు.
స్థానికంగా ఉన్న వాళ్లు గాయత్రి దేవి ప్రవర్తన చూసి ఛీ అంటూ ఉమ్మారు. పియాంగ్ ఒంటిపై 64 గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టంలో తేలింది. కొన్ని ఎముకలు కూడా విరిగాయి. బ్రెయిన్ రక్తంతో నిండి ఉంది. తలపై గట్టిగా కొట్టడం వల్ల చనిపోయిందని పోస్ట్ మార్టంలో తేలింది. ఇది చూసి మనిషా రాక్షసా అని అంటున్నారు అంతా. ఇక జడ్జి అయితే మరింత ఘోరంగా మండిపడ్డారు.