Megastar House : ఇంద్ర భవనాన్ని తలపిస్తున్న మెగాస్టార్ ఇల్లు
Megastar House : టాలీవుడ్ లో మాస్ పల్స్ బాగా తెలిసిన హీరో మెగాస్టార్ చిరంజీవి. తన సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. దాదాపు రెండున్నర దశాబ్దాలకు పైగా నంబర్ వన్ స్థానంలో హీరోగా తన ఆధిపత్యాన్ని చెలాయించారు. ఎన్నో సూపర్ డూపర్ హిట్లతో ఇండస్ర్టీని ఏలాడు. ఒకానొక సమయంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకొని అన్ని ఇండస్ర్టీలు ఆశ్చర్యపోయేలా చేశాడు. ప్రస్తుతం యువ హీరోలు, కొత్త హీరోలు హిట్లు కొడుతున్నా వాళ్లకు ధీటుగా తన సినిమాలతో సత్తా చాటుతున్నాడు. దాదాపు పదేళ్ల పాటు సినిమా ఇండస్ర్టీకి దూరంగా ఉన్నా తిరిగి తెరపై కనిపించి తనలో గ్రేస్ తగ్గలేదని నిరూపించుకున్నాడు.
ప్యాలెస్ ను తలపించేలా కొత్త ఇల్లు
నాలుగు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో రాణిస్తున్న మెగా స్టార్ చిరంజీవి ఆస్తులు బాగానే కూడబెట్టాడు. ఉన్న డబ్బును జాగ్రత్త పొదుపు చేయడంతో పాటు పలు వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టారు. ఇతర దేశాల్లో హోటల్స్ బిజినెస్ చేస్తున్నారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో దాదాపు రూ.100 కోట్లతో అత్యాధునిక హంగులతో కొత్త ఇంటిని నిర్మించిన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రానికి సమీపంలో మెగాస్టార్ కొత్త ఇల్లు ఉంటుంది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిల్యాని ఈ ఇంటిని డిజైన్ చేశారు. దాదాపు 25వేల చదరపు అడుగుల స్థలంలో ఈ ఇల్లు కట్టారు. ప్యాలెస్ ను తలపించేలా ఈ ఇల్లు ఉంటుంది.
రెండో అంతస్తులో స్విమ్మింగ్ పూల్
ఉదయం వేళ సూర్యుడి అందాలు ఆస్వాదించేలా రెండో అంతస్తులో స్విమ్మింగ్ పూల్ కట్టారు. కింది అంతస్తులో పూజ కోసం దేవుడి గది కట్టారు. దేవుడి ఫొటోలతోపాటు తన తండ్రి ఫొటో, మామ అల్లు రామలింగయ్య ఫొటోలు ఇందులో ఉన్నాయి. ఇటీవలే వాస్తు సలహాలకు అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేశారు. హైదరాబాద్ లోనే కాకుండా బెంగళూరులో కూడా మరో అందమైన భవంతిని చిరంజీవి కట్టుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి అప్పుడప్పుడూ అక్కడికి వెళ్లి వస్తుంటారు.