JAISW News Telugu

Karnataka : మాల్ ను ఏడు రోజులు మూసివేయాలి.. రైతుకు అవమానంపై కర్ణాటక ప్రభుత్వం ఆగ్రహం

FacebookXLinkedinWhatsapp
Karnataka

Karnataka Farmer

Karnataka : పంచెకట్టుతో వచ్చిన రైతును అవమానించిన ఓ మాల్ యాజమాన్యం ప్రభుత్వ ఆగ్రహానికి గురైంది. పంచెకట్టుతో వచ్చిన అన్నదాతను బెంగళూరులోని ఓ మాల్ లోకి రానివ్వక పోవడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఏడు రోజుల పాటు మాల్ ను మూసివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రవర్తన వ్యక్తి గౌరవానికి భంగం కలిగించడం కిందికే వస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

మంగళవారం మాగడి రోడ్డు జీటీ మాల్ లోని మల్టీప్లెక్స్ లో కుమారుడితో కలిసి సినిమా చూడడానికి హావేరికి చెందిన ఫకీరప్ప అనే రైతు వచ్చాడు. ఆ రైతును అక్కడి కాపలాదారు గోపాల్ అడ్డుకున్నాడు. పంచె కట్టుకుని వచ్చిన ఆయనను లోపలికి అనుమతించలేదు. ఫకీరప్ప కుమారుడు దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ ఘటనపై రైతు సంఘాల నాయకులు తీవ్రంగా స్పందించారు. మాల్ యాజమాన్యం క్షమాపణలు చెప్పకపోతే, పంచెకట్టుతో వేలమంది రైతులు వచ్చి మాల్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. దీంతో దిగివచ్చిన మాల్ యాజమాన్యం రైతుకు శాలువా కప్పి సత్కరించింది. అందరి ముందు క్షమాపణలు కోరింది. ఇకపై ఇటువంటి పొరపాటు చేయమని ప్రకటించింది.

Exit mobile version