JAISW News Telugu

plane : విమానంలో బాంబు ఉందంటూ మెయిల్.. పరుగులు పెట్టిన సిబ్బంది, ప్రయాణికులు

plane

plane

plane in Bomb threat : శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు తీవ్ర కలకలం రేపింది. కోయంబత్తూరు, చెన్నై వయా హైదరాబాద్ వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో శంషాబాద్ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా నిలిపివేశారు. అధికారులు ఎయిర్ పోర్టులో హై అలర్ట్ ప్రకటించారు. ఈ చర్యలతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అనంతరం బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేసింది. ఆరు గంటలు తనఖీలు చేసిన తరువాత బాంబు ఆనవాళ్లు ఏమీ లేవని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ సమయంలో ఇండిగో విమానంలో 181 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రస్తుతం పోలీసులు ఆ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో గుర్తించే పనిలో ఉన్నారు.

Exit mobile version