Chandrababu : పవన్ సీటుకు లైన్ క్లియర్.. ఇక ఆ సమస్య లేదన్న చంద్రబాబు.. 

Chandrababu

Chandrababu

Chandrababu : రాజకీయంలో ఉన్న రెండు పార్టీలు పొత్తులు పెట్టుకున్న సమయంలో ఆశావహులు, నిరాశావాదులు ఉండడం కామనే. కానీ వాటిని ఎలా ఎదుర్కోవాలన్నదానిపై అధి నాయకులకు పట్టు ఉండాలి. టీడీపీ+జనసేన+బీజేపీ శిబిరంలో అధినాయకులు పోటీ చేసే స్థానాలపై అందరి దృష్టి ఉంటుంది. ఇందులో భాగంగా పిఠాపురం నుంచి పోటీ చేస్తానని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటించిన తర్వాత ఆయన శిబిరంలో పెద్ద దుమారమే రేగింది. అక్కడ ఉన్న ఎస్వీఎస్ఎన్ వర్మ విషయంలో జనసైనికులు కొంత ఆందోళన వ్యక్తం చేశారు.

కానీ చంద్రబాబు సీనియర్ రాజనీతిజ్ఞుడు, ట్రబుల్ షూటర్ కావడంతో కొంచెం ఆగ్రహంతో ఉన్న వర్మను శాంతింపజేసి చేయిదాటిపోకముందే పిఠాపురంలో పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. అయితే చంద్రబాబు వర్మకు గౌరవప్రదమైన పదవి ఇస్తామని లేదంటే ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.

వర్మను కలిసిన చంద్రబాబు కొన్ని పొత్తు సమీకరణాలు నెరవేరాల్సి ఉన్నందున పవన్ కళ్యాణ్ పిఠాపురం వస్తున్నాడని ఆ సమీకరణాలను చంద్రబాబు వర్మకు వివరించారు. వర్మతో భేటీ అనంతరం బాబు మీడియాతో మాట్లాడుతూ.. తాను చేస్తున్న పనికి పార్టీ రివార్డు ఇస్తుందని స్పష్టం చేశారు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని వర్మ శిబిరానికి, టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

వర్మ కూడా మీడియాతో మాట్లాడుతూ తాను చంద్రబాబుకు విధేయుడినని స్పష్టం చేశారు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలిచేందుకు తన శక్తి మేరకు కృషి చేస్తానన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు భయానక పరిస్థితి కనిపించిన తర్వాత పవన్ కళ్యాణ్ కు మార్గం సుగమం కావడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 

TAGS