JAISW News Telugu

BJP: పొత్తుపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది…ఏపిలో బీజేపి బలోపేతం అవుతుంది.

టిడిపి, జనసేన వాళ్ళు 99 స్ధానాలు అనౌన్స్ చేసినా ఇంకా సీట్లు మిగిలున్నాయి కదా అని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు.టిడిపి-జనసేన కూటమితో  పోత్తు ఉంటుందా లేదా అన్నది మా అదిష్టానం తెల్చాల్సి ఉందన్నారు. సీ ట్ల విషయంలో వాళ్ళు కాంప్రమైజ్ అవుతారా అనేది అధిష్టానం చూసుకుంటుందని పురంధేశ్వరి తెలిపారు.

ఎన్నికలకు మా వ్యూహం మాదేనన్నారు. 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్ధానాల్లో మా వాళ్ళు పని చేస్తున్నారని పార్టీని సంస్ధా గ తంగా బలోపేతం చేసుకుంటున్నామని పురంధేశ్వరి తెలిపారు. అధిష్టానం ఆదేశాల‌ మేరకే మా పొత్తు, సీట్లు ఖరారు చేస్తామని అప్పటి వరకు పొత్తు విషయం పై మేము ఇక్కడ మాట్లాడమని ఆమె తెలిపారు.

ఇక పోతే పొత్తు పై బిజేపి అగ్రనేతలతో ఇప్పటికే చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు వరుస భేటీలు నిర్వహించారు. అయితే ఇంత వరకు బీజేపి మాత్రం పొత్తు పై తమ నిర్ణయం ప్రకటించలేదు. దీంతో చంద్రబాబు,పవన్ కల్యాణ్ లు ఉమ్మడి అభ్యర్థలను ప్రకటించారు.

Exit mobile version