Leader Silence : ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఒకరకంగా పనితీరు ఉంటది. అధికారంలోకి వస్తే ఆ నాయకుడి వ్యవహారం మరోలా ఉంటది.అంటే ప్రజల్లోకి వెళ్ళడానికి అవసరానికి ఒక పద్దతి.అవసరం తిరక మరొక పద్దతిని ఎంచుకొని ఆ నాయకుడి వ్యవహరించే తీరును ప్రజలు చూశారు. తాజాగ ఆయన ఎన్నికల ప్రచార శైలి చూసి ఆ రాష్ట్ర ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.ప్రతిపక్ష పాత్ర పోషించినపుడు రాష్ట్ర ప్రత్యేక హోదా కోసం థన్ ఎంపీలతో రాజీనామా చేయించాడు. మరోసారి ఆయన ఆమరణ నిరాహార దీక్ష కూడా చేసి ప్రజల మన్ననలను కూడా పొందడానికి ప్రయత్నం చేసాడు.
మరోసారి అధికారం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్న జగన్ తన ఎన్నికల ప్రచారంలో అయన కానీ, ఆయన అనుచరులు కానీ ప్రత్యేక హోదా అంశం గురించి ఎక్కడ కూడా ప్రస్తావించకపోవడంతో ఆ రాత్రి ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు.నిజంగా అప్పుడు,ఇప్పుడు మాట్లాడుతున్నది జగనేనా అని అనుమానంగా సభల్లో ఒకరికి ఒకరు చర్చించుకుంటున్నారు.ఐదేళ్లపాటు ముఖ్యమంత్రి హోదా అనుభవించిం జగన్ తాజా ఎన్నికల్లో రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి అంశాల గురించి మాట్లాడకపోవడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్ర ప్రజల అభివృద్ధి కోసం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుంది. ప్రస్తుతం పనులు ఎక్కడివరకు పూర్తయ్యాయి అనే ఇషయాన్ని కూడా ఎక్కడప్రస్తావించకపోవడం పై కూడా ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదేవిదంగా తన సొంత కడప జిల్లాలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి నిర్మించిన స్టీల్ కర్మాగారం నిర్మాణం పనుల విషయంలో జగన్ ఎక్కడ కూడా నోరు మెదపక పోవడం విస్మయానికి గురిచేస్తోంది.ముఖ్యమంత్రి హోదాలో ఎక్కడికి వెళ్లిన సంక్షేమ అంటూ మాట్లాడే జగన్ పోలవరం గురించి మాట్లాడకపోవడమేమిటని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఎవరు అధికారంలో ఉన్నా ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతూనే ఉంటాయి. కానీ ప్రతిపక్ష హోదాలో మాట్లాడిన అభివృద్ధి అంశాల గురించి తాజా ఎన్నికల ప్రచారంలో మాట్లాడక పోవడం శోచనీయం.