Assam Politician : కరెన్సీ మీద కప్పుకొని పడుకున్న నేత.. తిట్టిపోస్తున్న జనం.. ఎన్నికల వేళ ఇదేంటంటూ తలపట్టుకుంటున్న పార్టీ..

Assam Politician

Assam Politician

Assam Politician  : అస్సాంనేత వింత చేష్ట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘బెంజమిన్ యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (UPPL)’లో గతంలో ఉన్న నేత భారీ స్కాం చేశాడన్న ఆరోపణలతో పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యాడు. ప్రధానమంత్రి గృహ నిర్మాణ పథకం, గ్రామీణ ఉపాధి పథకానికి సంబంధించి జరిగిన అవినీతిలో ఆయన ప్రమేయం ఉందని ఎన్‌డీటీవీ నివేదించింది. అస్సాంలో UPPL బీజేపీకి మిత్రపక్షం. అయితే లోక్ సభ ఎన్నికల వేళ ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయ విశ్లేషకులు భిన్నంగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కరెన్సీ కప్పుకొని..
సదరు నేత బెంజమిన్ నుంచి దూరంగా ఉంటున్నాడని, ఆయనతో ప్రస్తుతం పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, గత జనవరిలోనే ఆయనను బహిష్కరించినట్లు పార్టీ అధ్యక్షుడు ప్రమోద్ బోరో స్పష్టం చేశారు. గ్రామ సభల అభివృద్ధి కమిటీ చైర్మన్‌ పదవి నుంచి కూడా ఫిబ్రవరిలో తొలగించినట్లు బరో తెలిపారు.

బెంజమిన్ బాసుమత్రి పిక్స్ సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతున్నాయి. యూపీపీఎల్‌తో బెంజమిన్‌కు సంబంధం లేదని స్పష్టం తెలుస్తోంది. 2024, జనవరి 10న ఆయనను బహిష్కరించారు. హరిసింగ బ్లాక్ కమిటీ నుంచి జనవరి 5న లేఖ అందిన నేపథ్యంలో అతనిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు బోరో సోషల్ మీడియా ఎక్స్ (ట్విటర్) ద్వారా తెలిపారు.

తిట్టిపోస్తున్న జనం..
అతను చేసేవాటితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. అవన్నీ ఆయన వ్యక్తిగత చర్చలు అని బోరో తెలిపారు. వైరల్ అవుతున్న బాసుమత్రి ఐదేళ్ల క్రితం తీసినదని, అందులోని డబ్బు తన సోదరికి చెందిందని బోరో స్పష్టం చేశారు.

TAGS