JAISW News Telugu

The Last Maharaja of Vijayanagaram : ‘ది లాస్ట్ మహారాజా ఆఫ్ విజయనగరం’ పుస్తకావిష్కరణ

The Last Maharaja of Vijayanagaram-Book Launch

The Last Maharaja of Vijayanagaram : విజయనగరం జిల్లా కేంద్రంలోని పూసపాటి రాజుల కోటలో మాన్సాస్ ట్రస్టు వ్యవస్థాపకుడు డా.పి.వి.జి.రాజు శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఆయన జీవిత చరిత్రపై రాసిన ‘ది లాస్ట్ మహారాజా ఆఫ్ విజయనగరం’ పుస్తకావిష్కరణ బుధవారం జరిగింది.

విజయనగరంలోని సింహాచల దేవస్థాన సత్రం విద్యార్థులు దీన్ని ఆవిష్కరించి, తొలి పుస్తకాన్న ట్రస్ట్ ఛైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజుకు అందజేశారు. అనంతరం ప్రత్యేక ఆహ్వానితులకు అందించారు. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి పూసపాటి కుటుంబ సభ్యలు విచ్చేసి ఉల్లాసంగా గడిపారు. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ కు చెందిన రచయితలు గీతా రామస్వామి, శశికుమార్, పరమేశ్వరరావు, అశోక్ గజపతిరాజు, సతీమణి సునీలా గజపతిరాజు, కుమార్తెలే అదితి గజపతిరాజు, విద్యావతి తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version