Kurchi Thaata : ప్రస్తుత జామానా సోషల్ మీడియాదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక్క డైలాగ్ ఫేమస్ అయ్యిందా.. ఇక అంతే అది గ్లోబల్ వైజ్ గా ఫేమస్ అవుతుంది. అదే డైలాగ్ పై రీల్స్, స్టోరీలు, స్టేటస్ లు, మీమ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. ఒక్కొక్కరు కోట్లాది రూపాయలు సంపాదించారు కూడా. గతంలో ‘కచ్చా బాదమ్’ సాంగ్ ఏ రేంజ్ లో ఫేమస్ అయ్యిందంటే. మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా రిలీజ్ అయ్యాయి. ఇవన్నీ పక్కన పెడితే కుర్చీని ‘మడతపెట్టి.. **’ గుర్తుకు ఉండే ఉంటుంది కదా ఆ డైలాగ్ చెప్పిన తాత ప్రస్తుతం కష్టాల్లో ఉన్నాడు. దీని గురించి తెలుసుకుందాం.
త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేశ్ బాబు కాంబోలో వచ్చిన సినిమా గుంటూరు కారం. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 నుంచి థియేటర్లలో సందడి చేసింది. ఈ సినిమాలో కుర్చీని ‘మడతపెట్టి..’ సాంగ్ ఒక ఊపు ఊపింది. ఈ సాంగ్‌పై రీల్స్, మీమ్స్ తెగ వైరల్ అయ్యాయి. ఈ డైలాగ్ ఒక సందర్భంలో ఒక తాత చెప్పింది కావడంతో క్రేజ్ వచ్చింది. ఈ డైలాగ్ సినిమాలో వాడుకున్నందుకు తాతకు రూ. లక్ష సాయం కూడా అందించారు. అప్పటి నుంచి ఆయన పేరు కుర్చీతాతగా మారింది.
అయితే ఈ తాత అరెస్ట్ అయ్యాడని తెలుస్తుంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. నటి స్వాతి నాయుడు, వైజాగ్ సత్య ఫిర్యాదుతో కుర్చీ తాతను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. తమను బూతులు తిడుతూ వీడియో చేస్తున్నాడని.. ‘ఆయన డబ్బు కాజేసి వైజాగ్ పారిపోయానని’ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని వైజాగ్ సత్య పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ కుర్చీ తాత అసలు పేరు షేక్ అహ్మద్ పాషా, హైదరాబాద్ లోని కృష్ణ కాంత్ పార్క్ వద్ద ఉంటాడు. భార్య, కొడుకులు, కూతురు కూడా ఉన్నారు. ఇంట్లో వాళ్లని పట్టించుకోకుండా రోడ్లపై తిరుగుతుంటాడు. యూ ట్యూబ్ ఛానల్స్ అతన్ని వైరల్ చేయడంతో పాపులర్ అయ్యడు.