Korean car : మార్చి 3, 2022 నుంచి ఏప్రిల్ 14, 2023 మధ్య తయారు చేసిన 1,138 కియా ఈవీ6 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ నిర్ధిష్ట యూనిట్ల కోసం స్వచ్ఛంద రీకాల్‌ను ప్రారంభించింది. ఇంటిగ్రేటెడ్ ఛార్జింగ్ కంట్రోల్ యూనిట్ (ICCU)లో తలెత్తిన సమస్య కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కియా కంపెనీ తెలిపింది. ఇందులో 12 వోల్ట్ బ్యాటరీ ఛార్జింగ్ సమస్య తలెత్తుతుందని కంపెనీ దృష్టికి వచ్చింది.
ICCUలో 12 వోల్ట్ యాక్సిలరీ బ్యాటరీ సరిగ్గా ఛార్జ్ కావడం లేదన్న లోపాన్ని కంపెనీ గుర్తించింది. ఈ బ్యాటరీ లైట్లు, మ్యూజిక్ సిస్టం, వాహనం స్టార్ట్-స్టాప్ వంటి భద్రతా ఫంక్షన్లకు అనుసంధానంగా పని చేస్తుంది. ఈ యూనిట్‌లో తలెత్తిన వైఫల్యం కారణంగా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అసహనం కలిగిస్తుంది. ఇది ముఖ్యమైన భద్రతా ప్రమాణాలకు అనుసంధానంగా పని చేస్తుంది కాబట్టి కంపెనీ వెంటనే రీ కాల్ చేసింది.
12 వోల్ట్ సహాయక బ్యాటరీ ఈవీ6లోని అనేక క్లిష్టమైన సిస్టంలతో అనుసంధానిస్తుంది. ICCU పనిచేయకపోతే అది చాలా ఫంక్షన్లు విఫలమయ్యేందుకు దారితీయవచ్చు. దీని వలన డ్రైవింగ్ సమయంలో విద్యుత్ నష్టం, ప్రమాదకర పరిస్థితులు ఏర్పడవచ్చు.
ఈ సమస్యను సరి చేసేందుకు కంపెనీ సర్వీస్ అపాయింట్‌మెంట్లను ఏర్పాటు చేసింది. వాహనాల యజమానులను నేరుగా వాటిని సంప్రదించవచ్చు. ఐసీసీయూ సాఫ్ట్‌వేర్‌ను ఉచితంగా అప్‌డేట్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. సహాయక బ్యాటరీ సరిగ్గా ఛార్జి అవుతుందని నిర్ధారించుకున్న తర్వాతే యజమానికి కారును అప్పగిస్తామని కంపెనీ తెలిపింది.
కియా ఈవీ6 యజమానులు వారి సమీపంలోని షోరూంకు వెళ్లి తమ కారు రీకాల్ లిస్ట్ లో ఉందో లేదో తెలుసుకోవాలి. సమస్యలు ఉన్న కార్ల గుర్తింపునకు (VIN) పూర్తి జాబితాను కలిగి ఉంటాయి. అదనంగా, మరింత సాయం, సమాచారాన్ని అందించేందుకు కియా ఇండియా కస్టమర్ సేవ అందుబాటులో ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది.