Kaviya Maran : సౌతాఫ్రికా టీ 20 లీగ్ ను దున్నేసిన ‘కావ్యా పాప’ టీం..ప్రైజ్ మనీ అన్ని కోట్లే?

Kaviya Maran

Kaviya Maran

Kaviya Maran : సౌతాఫ్రికా టీ-20 లీగ్ 2024లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు చాంపియన్ గా నిలిచింది. మొన్న శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఈస్టర్న్ కేప్ జట్టు డర్బన్ సూపర్ జెయింట్స్ పై నెగ్గింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 204 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్ లో డర్బన్ సూపర్ జెయింట్స్ 115 పరుగులకే పరిమితమైంది. ఇది సన్ రైజర్స్ కు ఇది వరుసగా రెండో టైటిల్ కావడం విశేషం.

ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?
సౌతాఫ్రికా టీ 20 లీగ్ లో గెలిచిన జట్టుకు 3.25 కోట్ల ర్యాండ్స్ అందజేస్తారు. ఇండియన్ కరెన్సీలో రూ.14.21 కోట్లు ప్రైజ్ మనీని సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు గెలుచుకుంది. రన్నరప్ జట్టుకు 1.62 కోట్ల ర్యాండ్లు. అనగా 7.2 కోట్లు. ఈ మొత్తాన్ని రన్నరప్ డర్బన్ సూపర్ జెయింట్స్ కు అందించనున్నారు. దీంతో పాటు సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు రూ.4.37లక్షలు కూడా అందుకుంది.

కావ్య పాప సందడే సందడి..
కావ్య పాపకు సోషల్ మీడియాలో హీరోయిన్ రేంజ్ లో పాపులారిటీ ఉంది. ఐపీఎల్ జరుగుతున్న ప్రతీసారి వార్తల్లో ఉంటుంది. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆడే ప్రతీ మ్యాచ్ లో కావ్య మారన్ సందడి మాములుగా ఉండదు. ఈమే సన్ రైజర్స్ టీం సీఈవో అనే విషయం తెలిసిందే.

తమిళనాడు మీడియా మొఘల్ కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్ 2018లో సన్ రైజర్స్ బాధ్యతలను స్వీకరించారు. జట్టును వెనకుండి నడిపించడంతో పాటు సోషల్ మీడియాలోనూ హల్ చల్ చేస్తుంది. 1992లో కళానిధి మారన్, కావేరి మారన్ దంపతులకు కావ్య జన్మించింది. ఉన్నత చదువుల తర్వాత తండ్రి వ్యాపారాలను కావ్య చేపట్టింది. క్రికెట్ పై ఆసక్తితో ఐపీఎల్ ఫ్రాంచైజీ బాధ్యతలు చూసుకుంటోంది.

TAGS