IAS petition : ఐఏఎస్ ల పిటిషన్ పై విచారణ పూర్తి.. తీర్పు రిజర్వు

IAS petition
IAS petition : డీవోపీటీ ఉత్తర్వులపై ఐఏఎస్ అధికారులు వాణిప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రోస్, ఆమ్రపాలి, సృజన, శివశంకర్, హరికిరణ్ హైకోర్టును ఆశ్రయించారు. ట్రిబ్యునల్ లో నవంబరు 4న విచారణ ఉందని, అప్పటి వరకు రిలీవ్ చేయవద్దని ఐఏఎస్ ల తరపు న్యాయవాది కోరారు. స్టే ఇస్తూ పోతే ఈ అంశం ఎన్నటికీ తేలదని ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. వివాదాన్ని తేలుస్తాం, ముందు కేటాయించిన రాష్ట్రాల్లో చేరాలని సూచించింది. ‘‘మీరంతా బాధ్యతాయుతమైన అధికారులు, ప్రజలకు ఇబ్బంది కలగనీయవద్దు. ఎవరు ఎక్కడ పనిచేయాలనేది కేంద్రం నిర్ణయిస్తుంది. మరోసారి పరిశీలించాలని డీవోపీటీని ఆదేశించమంటారా..?’’ అని ధర్మాసం అడిగింది. రిలీవ్ చేసేందుకు 15 రోజుల గడువు ఇవ్వాలని రెండు రాష్ట్రాలు డీవోపీటీని కోరాయని ఐఏఎస్ ల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.