HIV Injection : హెచ్ఐవీ వ్యాధి నియంత్రణ దిశగా కీలక అడుగు పడింది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న హెచ్‌ఐవీ నుంచి రక్షణ ఇచ్చే ఇంజెక్షన్ లెనాకాపవిర్ త్వరలో అందుబాటులోకి రాబోతోంది. ఏటా రెండుసార్లు ఈ ఇంజెక్షన్ తీసుకోవడం ద్వారా ఆ వైరస్ కు చెక్ పెట్టవచ్చు. దక్షిణాఫ్రికా, ఉగాండాలో జరిగిన ఓ పెద్ద క్లినికల్ ట్రయల్, కొత్త ఫ్రీ-ఎక్స్‌పోజర్ ప్రొఫిలాక్సిస్ డ్రగ్‌ని ఏడాదికి రెండుసార్లు తీసుకుంటే యువతులకు హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ నుంచి విముక్తి లభిస్తుంది. ఇతర ఔషధాల కంటే మెరుగైన రక్షణను అందిస్తుంది. ఇది హెచ్‌ఐవీని తగ్గిస్తుందని వైద్య శాస్త్రవేత్త అయిన లిండా-గెయిల్ బెక్కర్ తెలిపారు. దీని కోసం 5000 మందిపై పర్పస్ 1 ట్రయల్ వేశారు. రెండు ఔషధాల సామర్థ్యాన్ని పరీక్షించారు.
లెనాకావిర్ అనే ఫ్యూజన్ క్యాప్సిడ్ ఇన్హిబిటర్ ఇంజెక్షన్‌తో పరీక్షించారు. ఇది హెచ్ఐవీ జన్యు పదార్ధం. ప్రతిరూపణకు అవసరమైన ఎంజైమ్‌లను రక్షించే ప్రోటీన్ షెల్. ఇది ప్రతి ఆరు నెలలకు ఒకసారి చర్మంపై వేస్తారు. ఈ ఇంజెక్షన్‌ను 16 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలకు ఇస్తారు. ఇది మెరుగైన రక్షణను అందిస్తుంది. రెండో ఇంజెక్షన్ డెస్కోవీ ఎఫ్/టీఏఎఫ్. ఇది మెరుగైన ఫార్మకోకైనటిక్ లక్షణాలు కలిగి ఉంది. ఇది ఎక్కువగా పురుషులు, లింగమార్పిడి చేసుకున్న స్త్రీలలో ఎక్కువ ఉపయోగం ఉంది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా 1.3 మిలియన్ల కొత్త హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి.
నిజానికి హెచ్‌ఐవీని నిరోధించే రెండు రకాల టాబ్లెట్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. మొదటిది 2012లో అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) అనుమతి పొందిన ట్రువాడా టాబ్లెట్. రెండోది.. 2016లో అందుబాటులోకి వచ్చిన డెస్కోవీ. ఆ రెండింటితో పోలిస్తే క్లినికల్ ట్రయల్స్‌లో లెనాకావిర్ ఇంజెక్షన్ నూటికి నూరుశాతం విజయవంతం కావడం గమనార్హం. ఈ ఔషధం.. హెచ్‌ఐవీ క్యాప్సిడ్ (వైరస్ చుట్టూ ఉండే ప్రొటీన్లతో కూడిన రక్షణ పొర)ను ధ్వంసం చేయడం ద్వారా వైరస్ తన సంఖ్యను పెంచుకోకుండా చేస్తుంది. ఆఫ్రికా దేశాల్లో చాలా మంది మహిళలు అత్యాచారాలకు గురై ఎయిడ్స్ బారిన పడుతున్న నేపథ్యంలో ఈ ఇంజెక్షన్ క్లినికల్ ట్రయల్స్‌ను సౌతాఫ్రికాలోని 25 ప్రాంతాల్లో, ఉగాండాలోని మూడు ప్రాంతాల్లో నిర్వహించారు.