Korata Shiva : టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడు కొరటాల శివకు 80 శాతం సక్సెస్ రేట్ ఉంటుంది. మిర్చి, జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బాక్సాఫీస్ సక్సెస్ ను సొంతం చేసుకున్న కొరటాల శివ ఈ సినిమాలతో మంచి మెసేజ్ ఇచ్చారు.
కానీ, మెగాస్టార్ చిరంజీవితో చేసిన ‘ఆచార్య’ సినిమా ఫ్లాప్ కావడం, ఇది భారీ స్థాయిలో నష్టాలను మిగల్చడంతో కొరటాల శివ ఇలాంటి సినిమా తీశాడేంటని కామెంట్లు వినిపించాయి. ఇదే సమయంలో శ్రీమంతుడు కాఫీరైట్ వివాదంలో కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది.
శ్రీమంతుడు విషయంలో కథను కాపీ కొట్టాడని వివాదం బయటకు రావడంతో ఆయన గతంలో తీసిన సినిమాలు కూడా కాపీయే కావచ్చని ప్రచారం జరుగుతుంది. నిజం చెప్పాలంటే ఇండస్ట్రీ కొరటాల శివను ఒక విలన్ గా చూస్తోంది.
అయితే, ఒకే ఆలోచన ఇద్దరు రచయితలకు రావడంలో అంత ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. ఇది కేవలం యాధృశ్చికంగా ఇద్దరు రచయితలు ఒకే విధంగా ఆలోచించి ఒకే కథతో సినిమా చేసిన సందర్భంగాలు కొన్ని ఉన్నాయి. టాలీవుడ్ లో ఒక సినిమాను పోలిన సినిమాలు అంటే ఒకే కథతో వచ్చి బాక్సాఫీస్ హిట్లు కొట్టిన సినిమాలు కూడా అనేకం ఉన్నాయి. ‘చచ్చేంత ప్రేమ’ అనే కథను కొరటాలశివ చదవలేదని ఈ ఆరోపణలు వచ్చిన సందర్భంలో చెప్పారు.
కొరటాలను అభిమానించని వాళ్లు కూడా ఆయన తప్పు చేశారంటే ఒకింత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ‘చచ్చేంత ప్రేమ’ కథకు ‘శ్రీమంతుడు’ సినిమాకు పోలికలు ఉన్నా కథ మొత్తం కాపీ కొట్టినట్లు ఎక్కడా కనిపించదు. ‘చచ్చేంత ప్రేమ’కు విల్సన్ రచయిత ‘శరత్ చంద్ర’ అనే కలం పేరుతో ఆయన చాలా వరకు నవలలు రాశాడు. కొరటాల ఈ వివాదంలో నుంచి ఎంత తొందరగా బయట పడితే అంత మంచిదని పలువురు సూచిస్తున్నారు.