Dharmapuri Temple : సుప్రసిద్ధ జగిత్యాల జిల్లాలోని ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం రూ. 1,81,459 లు ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వివిధ కార్యక్రమాల టికెట్ల అమ్మకం ద్వారా రూ.98,542, ప్రసాదం అమ్మకం ద్వారా రూ.962,880, అన్నదానం ద్వారా రూ. 20,037 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన నరసింహ క్షేత్రాల్లో ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఒకటి. ఇది కరీంనగర్ పట్టణానికి 75 కి.మీ.ల దూరంలో ఉంది. పవిత్ర గోదావరి నదీ తీరాన వెలసిన శివకేశవుల నిలయమైన ఈ క్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, శ్రీ రామలింగేశ్వర దేవాలయం, మసీదులు ప్రక్కప్రక్కనే ఉన్నాయి. అనాది నుంచి శైవ, వైష్ణవ, ముస్లింల మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఇక్కడ స్వామివారు యోగానంద నారసింహ స్వామిగా భక్తుల క్రికలు నెరవేరుస్తున్నారు. ధర్మపురికి పోతే యమపురి ఉండదు అని పెద్దలు చెప్తుంటారు.