OTT : ఇండియన్ సినిమా చాలా ఏండ్ల నుంచి కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఒకప్పుడు సినిమాలు రెండు మూడు నెలలు థియేటర్లలో ఆడేవి. వంద రోజుల సెలబ్రెషన్లు చేసుకునేవారు. ఇంకాస్త ముందుకెళ్లిన సినిమాలు కూడా ఉన్నాయి. కానీ ప్రస్తుతం కాలం మారిపోయింది. ప్రస్తుతం సినిమాలు రెండు, మూడు వారాల కంటే ఎక్కువగా థియేటర్లలో ఉండటం లేదు. చిన్న సినిమాల లెక్క అయితే వేరేలా ఉంటుంది. అసలు వాటికి థియేటర్లు దొరకడం లేదు. థియేటర్లు ఇచ్చినా చూసేందుకు ఎవరూ రావడం లేదు.
థియేటర్ రిలీజ్ అయిన సినిమా ఎప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందా అని చాలా మంది వెయిట్ చేస్తున్న సందర్భాలు ప్రస్తుత కాలంలో ఎక్కువ కనిపిస్తున్నాయి. థియేటర్ లో సినిమా ఉన్నప్పుడు ఓటీటీలోకి వస్తే ఇక థియేటర్ కి ఎవరూ వెళ్తారు. ఇలా కూడా కొన్ని సందర్భాల్లో జరగుతున్నాయి. కొన్ని సినిమాలు థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి వస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ హిట్ మూవీ కిల్ ఇంకా థియేటర్లలో నడుస్తోంది. రిలీజ్ అయి నాలుగు వారాలు కూడా కాకముందే ఈ సినిమాను ఫిల్మ్ మేకర్స్ రెంటల్ పద్ధతిలో సినిమాను
ఫ్రైమ్ లో అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఇండియాలో పెద్ద ఎత్తున పైరసీ ఉందనే విషయం అందరికీ తెలిసిందే. కాగా ఒక వైపు సినిమా థియేటర్లలో నడుస్తుండటం.. మరో వైపు ఇటు ఓటీటీలోకి తీసుకురావడంపై ఫిల్మ్ మేకర్స్ తీసుకున్న నిర్ణయం పై ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం క్వాలీటీ హెచ్ డీ ప్రింట్ తో సినిమా ఓటీటీలో అందుబాటులోకి రావడంతో ఇప్పటికే డౌన్ లోడ్ చేసుకుని చాలా మంది సినిమాను చూస్తున్నారు. మరీ ఇలాంటి సందర్భంలో మేకర్స్ తెలివి తక్కువతనం వల్ల అటు థియేటర్లలో ఇటు ఫోన్లలో అందుబాటులో ఉంది. దీంతో మరి కొన్ని రోజులు థియేటర్లలో నడవాల్సిన కిల్ మూవీని ముందుగానే ఓటీటీలోకి తీసుకురావడం వల్ల థియేటర్ల చూడాలనుకునే వారికి నిరాశ కలిగించారు.