Heroine : లవ్ ఫెయిల్యూర్ అయ్యిందన్న హీరోయిన్.. ఆ పర్సన్ గురించి సోషల్ మీడియాలో రచ్చ..
Heroine : యంగ్ హీరోయిన్ లలో రాశీఖన్నా ఒకరు. ఊహలు గుస గుసలాడేతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాను డైరెక్ట్ చేసింది కమెడియన్ అవసరాల శ్రీనివాస్ కాగా.. హీరోగా నాగ శౌర్య నటించగా.. హీరోయిన్ గా రాశీఖన్నా చేసింది. ఈ మూవీ భారీ హిట్ సాధించకపోయినా హీరోయిన్ కు మాత్రం మంచి ఫేమ్ వచ్చింది. ఆ తర్వాత మంచి ప్రాజెక్టులే వచ్చాయి. కానీ తక్కువ సమయంలోనే ఫేడ్ అయిపోయింది రాశీఖన్నా.
తాజాగా నటి ఈ హీరోయిన్ తన గత రిలేషన్ షిప్ గురించి ఓపెన్ అయింది. ఒకప్పుడు తాను ఒకరిని గాఢంగా ప్రేమించానని, అయితే ఆ బంధం నిలవలేదని తెలిపింది. హృదయవిదారకంగా ఉన్నప్పటికీ, ఆ అనుభవం నుంచి విలువైన పాఠాలు నేర్చుకున్నానని ఆమె చెప్పింది. బ్రేకప్ తనను చాలా భావోద్వేగానికి గురిచేసిందని, మానసిక క్షోభకు కూడా దారితీసిందని రాశి చెప్పుకచ్చింది.
అయితే, ఆ కష్టకాలంలో తనకు అండగా నిలిచిన తన కుటుంబం, స్నేహితులకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. సినీ పరిశ్రమ వెలుపల తనకు ఎక్కువ మంది స్నేహితులు ఉన్నారని, బ్రేకప్ చివరికి తనను మరింత బలంగా మార్చిందని, ఆ తర్వాత తన కెరీర్ పై మరింత దృష్టి సారించిందని రాశి పేర్కొంది. మిస్టరీ ‘హీరో’ గురించి ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.
నాగశౌర్య సరసన నటించిన ఊహలు గుసగుసలాడే సినిమాతో తెరంగేట్రం చేసిన రాశీ ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ తో సుప్రీమ్, ప్రతిరోజూ పండగే, రామ్ తో హైపర్, శివం వంటి చిత్రాల్లో కనిపించింది. అలాగే గోపీచంద్, రవితేజ, విజయ్ దేవరకొండ, నాగ చైతన్య వంటి స్టార్స్ తో కూడా సినిమాల్లో నటించింది రాశీ. వీరిలో ఆమె మాజీ ప్రేమికుడు ఎవరని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.