Heroine disease : సోషల్ మీడియా రోజు రోజుకు మరింత విస్తృతం అవుతుంది. హీరో, హీరోయినే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల జీవితాలు కూడా తెరిచిన పుస్తకంగా మారిపోతుంది. దాదాపు సమంత నుంచి కావచ్చు.. హీరోయిన్లకు ఉన్న వ్యాధులు కూడా బయటకు వస్తున్నాయి. సమంత ఎక్కడ ఉంది.. ఏ ట్రీట్ మెంట్ తీసుకుంటుంది లాంటివి కూడా సోషల్ మీడియాలో రోజు రోజుకు వైరల్ అవుతూనే ఉంది. ఆ తర్వాత నవనీత్ కౌర్ గురించి ఇలా ఒక్కొక్కరి గురించి వెలుగు చూస్తూనే ఉంది. రీసెంట్ గా మరో హీరోయిన్ వ్యాధి గురించి కూడా సోషల్ మీడియా ద్వారా బయటకు తెలిసింది.
సోషల్ మీడియా ప్లాట్ ఫారాలల్లో వారే పంచుకుంటున్నారు. సమంత వ్యాధి, అది ఏ స్టేజ్ లో ఉంది..? తీసుకుంటున్న చికిత్స గురించి అప్డేట్స్ ఇస్తూనే ఉంది. తాజాగా మరో తెలుగు తార తాను కూడా ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పింది. ఆమెనే హీరోయిన్ ఆండ్రియా జెరెమియా. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆండ్రియా.. అనేక విషయాలను పంచుకుంది. సింగర్ గా సినిమాల్లోకి వచ్చి హీరోయిన్ గా మారి ప్రేక్షకుల మనసు దోచుకున్న స్టార్ ఆండ్రియా జెరెమియా.
అన్న రసూల్ మేకప్ రంగంలో ఉండడంతో ఆయన ఇన్ల్ఫుయెన్స్ ఉపయోగించుకొని వెండితెరపై అడుగుపెట్టింది. మొదట మాలీవుడ్ లో నటించింది. లోహం, లండన్ బ్రిడ్జ్, థోపిల్ జోప్పన్ చిత్రాల్లో నటించింది. కెరీర్ ఫాంలో ఉండగానే నటనకు గుడ్ బై చెప్పింది. ఆమె చివరి సినిమా ‘వడ చెన్నై’ ఇది తమిళ్ మూవీ. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఆండ్రియా మాట్లాడుతూ.. వడ చెన్నై తర్వాత ‘ఆటో ఇమ్యూన్ స్కిన్ కండిషన్’ ఉన్నట్లు నిర్ధారణ జరిగిందని, ఈ వ్యాధి కారణంగా కనుబొమ్మలు, వెంట్రుకలు బూడిద రంగులోకి మారాయి.
నిద్ర లేవగానే శరీరంపై మచ్చలు కనిపిస్తాయని.. ఈ పరిస్థితికి కారణం మానసిక ఒత్తిడే అని చెప్పింది. అనారోగ్యంతో బాధపడుతూ సినిమాలకు దూరంగా ఉన్నాను.. తాను సినిమాలకు బ్రేక్ తీసుకోవడంతో తనకు బ్రేకప్ అయ్యి డీప్రెషన్ లోకి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. ఈ వ్యాధికి గుర్తుగా శరీరంపై మచ్చలు మిగిలిపోయాయని.. ఇంకా కనురెప్పలు తెల్లగానే ఉన్నాయని.. ఇందుకు ఆక్యుపంక్చర్ ట్రీట్ మెంట్ మేలు చేసిందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆండ్రియా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.