Shruti Sharma : సిల్వర్ స్క్రీన్ పై కథానాయికగా రాణించాలంటే స్కిన్ షో తప్పనిసరి. కొన్నిసార్లు హద్దులు దాటక తప్పదు. అయితే ఈ విషయం మొత్తం తెలుసుకున్నాకే సినీ పరిశ్రమలోకే అడుగు పెడతారు. అయితే ఓ హీరోయిన్ మాత్రం స్క్రిప్ట్ చదివాక కొన్ని సన్నివేశాలు ఉన్నాయని తెలిసి కన్నీళ్లు పెట్టుకుందట. అయితే ఆ సన్నివేశాలకు సదరు హీరోయిన్ అభ్యంతరం చెప్పడంతో దర్శకుడు వాటిని తొలగించాడట.
ఒకప్పుడు ఇండియన్ టీవీ షోలు, సీరియళ్లు చాలా సంప్రదాయంగా ఉండేవి. సంప్రదాయ విలువలను పాటించేవి. ఎక్స్పోజింగ్, రొమాంటిక్ సన్నివేశాలు లేకుండా ధారావాహికలు రూపొందేవి. కానీ క్రమంగా కాలంతో పాటు ఇక్కడ కూడా సరిహద్దులు కూడా చెరిపోయాయి. గత దశాబ్దంలో బుల్లి తెరపై కూడా బోల్డ్ కంటెంట్‌ను ప్రసారం చేయడం మొదలైంది.
ఇప్పటికీ కొంతమంది హీరోయిన్లు ముద్దులు, రొమాంటిక్ సన్నివేశాలకు దూరంగా ఉంటున్నారు. తమకున్న పాపులారిటీ, లేదా ఇమేజ్ రీత్యా సాయి పల్లవి, నిత్యా మీనన్ లాంటి కొంత మంది మాత్రమే వీటికి దూరంగా ఉంటున్నారు. అందులో ఒకరు శృతి శర్మ.
నవీన్ పోలిశెట్టి హీరోగా చేసిన”ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ”లో శృతి శర్మ హీరోయిన్. 2019లో “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” సినిమాతో తెలుగులో హీరోయిన్ గా అడుగు పెట్టింది. ఆ తర్వాత ‘పాగ్లైట్’తో బాలీవుడ్ లోకి వెళ్ళింది. అయితే తాను రొమాంటిక్ సన్నివేశాల్లో నటించనని శృతి ముందుగానే చెప్పింది. ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శృతి శర్మ తనకు రొమాంటిక్, ముద్దు సన్నివేశాలు చేయడం ఇష్టం లేదని వెల్లడించింది.
తానెప్పుడు తెరపై బోల్డ్‌గా నటించనని కుండబద్దలు కొట్టింది. రొమాంటిక్ సీన్స్, కిస్సింగ్ అంటే తనకు ఇష్టముండదని స్పష్టం చేసింది. అందుకే చాలా ప్రాజెక్టులు రిజెక్ట్ చేశానని చెప్పింది. ఈ సంవత్సరం ప్రారంభంలో శృతి శర్మ సంజయ్ లీలా భన్సాలీ మొదటి వెబ్ సిరీస్ ‘హీరామండి’లో ఓ చిన్న పాత్రతో ఓటీటీలోకి అడుగు పెట్టింది. హీరామండి స్క్రిప్ట్ చదివాక ముద్దు సన్నివేశాలు ఉన్నాయని తెలిసి కన్నీళ్లు పెట్టుకున్నానని చెప్పింది. అయితే అలాంటి సన్నివేశాలు తనకు ఇబ్బంది కలిగిస్తాయని తెలిసి భన్సాలీ వాటిని తొలగించారని చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే శృతి టెలివిజన్ పరిశ్రమలోకి మళ్లీ రావాలని భావిస్తున్నట్లు వెల్లడించింది.