Minister Lokesh : తప్పు చేసిన ఏ ఒక్కరినీ ప్రభుత్వం విడిచిపెట్టదు: మంత్రి లోకేశ్

Minister Lokesh
Minister Lokesh : తప్పు చేసిన ఏ ఒక్కరినీ ప్రభుత్వం విడిచిపెట్టదని మంత్రి లోకేశ్ అన్నారు. శుక్రవారం అసెంబ్లీ లాబీలో మీడియాలో మంత్రి లోకేశ్ మాట్లాడారు. గత ఐదేళ్లలో అక్రమ కేసులతో ఎంత వేధించినా టీడీపీ కార్యకర్తలు ధైర్యంగా నిలబడ్డారని తెలిపారు. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని పేర్కొన్నారు. అనంతరం పలువురు ఎమ్మెల్యేలతో లోకేశ్ చర్చించారు. జాగ్రత్తగా పని చేయమని బాధ్యతలను ఇస్తూ ఎక్కువ ఓట్లతో ప్రజలు మనల్ని గెలిపించారన్నారు.
ఎమ్మెల్యేల వినతులపై లోకేశ్ స్వయంగా స్టేటస్ రిపోర్టు ఇచ్చారు. కేంద్ర మంత్రులకు వినతిపత్రం ఇస్తే వారు సమాధానం ఇస్తున్న విధానాన్ని ఇక్కడా అమలు చేస్తున్నామని వెల్లడించారు. రానున్న రోజుల్లో ఈ విధానాన్ని మరింత పటిష్ఠం చేస్తామన్నారు.