JAISW News Telugu

CM Revanth : కోడ్ ముగియడంతోనే శుభవార్త చెప్పనున్న ప్రభుత్వం.. భారీ ప్లాన్ వేసిన సీఎం..!

CM Revanth

CM Revanth

CM Revanth : తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ప్రజా సంక్షేమంపై ప్రధాన దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా నిరుద్యోగుల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఎలక్షన్ల తర్వాత వారికి గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధం అవుతుందట. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పదేళ్లుగా నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారని చెప్పిన సీఎం ఇకపై ఇలా జరగకుండా TSPSC ప్రక్షాళన చేయబోతోందట. తమ పాలనలో నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని హామీ ఇస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఉన్నామని సీఎం చెప్తున్నారు. అయితే, ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ సిద్ధం చేశారట. లోక్ సభ కోడ్ ముగిసిన వెంటనే కీలక ప్రకటన చేస్తారని సమాచారం.

ప్రభుత్వ కొలువుల కోసం నిరుద్యోగులు ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఇకపై అలా జరగకుండా UPSC నమూనాలో జాబ్‌ క్యాలెండర్‌ రిలీజ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిరుద్యోగుల ప్రతీ సమస్యను కాంగ్రెస్ పరిష్కరిస్తుందని రేవంత్ హామీ ఇస్తున్నారు.

యూపీఎస్సీ, కేరళ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తరహాలో రాష్ట్రంలో కూడా జాబ్‌ క్యాలెండర్‌ విధానం అమల్లోకి తేవాలని అనుకుంటున్నారట. ఏ నెలలో ఏ నోటిఫికేషన్‌ వస్తుందనేది జాబ్ క్యాలెండర్ ద్వారా తెలుస్తుంది. జాబ్‌ క్యాలెండర్‌లో తేదీల ప్రకారం ఆయా గడువు తేదీల్లోగా నియామకాలు పూర్తవుతాయి. ఇది విద్యార్థుల సమయం వృథా కాకుండా భవిష్యత్ కు పునాది వేస్తుంది.

ఇప్పటికే TET, DSC నోటిఫికెషన్స్ రిలీజ్ చేసిన ప్రభుత్వం.. మరో రెండేళ్లలో మరిన్ని ఉద్యోగాలు భర్తీ చేయనుందని తెలుస్తోంది. అన్ని శాఖల్లో ఖాళీల వివరాలను ప్రభుత్వం సేకరిస్తుందట. ఉద్యోగాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికీ తమ మార్క్ నిలిచిపోయేలా ఉండాలని రేవంత్ భావిస్తున్నారట.

పార్లమెంటు ఎన్నికలు పూర్తయిన తర్వాత కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ షురూ అవుతుందని, అర్హులందరికీ కొత్త రేషన్ కార్డు అందుతుందని పలువురు తెలంగాణ మంత్రులు హామీ ఇచ్చారు. అధికారులు ప్రస్తుతం ఇదే పనిలో నిమగ్నం అయ్యారని చెప్తున్నారు.

కోడ్ ముగియగానే ప్రభుత్వ సిబ్బంది ప్రతీ ఇంటికీ వెళ్లి క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారట.  ఇందిరమ్మ కమిటీలతో కలిసి రేషన్ కార్డులు మంజూరు చేయాలనేది ప్రభుత్వ ఆలోచన అని తెలుస్తోంది.

Exit mobile version