Rythubandhu : రైతుబంధుపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం?
Rythubandhu : తెలంగాణలో పెట్టుబడి సాయం కోసం రైతుబంధు ఇస్తున్నారు. దీంతో రైతులు దాని కోసం ఎదురు చూస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పుడు చాలా మంది రైతులు రైతుబంధు సాయం కోసం ఆశగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతుబంధుపై ప్రభుత్వం ఇంతవరకు స్పష్టత ఇవ్వడం లేదు. దీని వల్ల రైతుల్లో అయోమయ స్థితి నెలకొంది.
ఇప్పుడు రైతుబంధు పడుతుందా? లేదా? అనే సందేహాలు కొందరిలో వస్తున్నాయి. కొందరేమో రెండు ఎకరాల లోపు వారికి పడుతున్నాయని అంటున్నారు. మరికొందరేమో ఎకరం ఉన్న తమకు పడలేదని చెబుతున్నారు. దీంతో రైతుబంధు విషయంలో ఏం జరుగుతోంది? రైతుబంధు ఇస్తారా? ఇవ్వరా? అనే కోణంలో చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుబంధు వేస్తామని భరోసా కల్పించింది. కానీ ఆచరణలో కనిపించడం లేదనే విమర్శలున్నాయి. ఈనేపథ్యంలో రైతుబంధు విషయంలో ప్రభుత్వం కచ్చితంగా వ్యవహరించడం లేదనే అభిప్రాయాలు వస్తున్నాయి. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఇది మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
రైతుబంధు సాయం రైతులందరికి అందజేయాల్సిన అవసరం ఏర్పడింది. క్షేత్రస్థాయిలో దీనిపై నిర్లక్ష్యంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇది ప్రభుత్వానికి గుదిబండగా మారే ప్రమాదం ఉంది. రైతుబంధు అమలుపై చొరవ చూపించాలి. రైతులకు సాయం త్వరితగతిన అందించే ఏర్పాట్లు చేయాలి. లేదంటే ప్రభుత్వంపై విమర్శలు ఇంకా పెరుగుతాయని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.