JAISW News Telugu

Girl Missing : బాలిక మిస్సింగ్.. గుర్తిస్తే చెప్పాలని తల్లి వేడుకోలు..

FacebookXLinkedin
Whatsapp
Girl Missing

Girl Missing

Girl Missing : అమెరికాలో ఓ బాలిక అదృశ్యమైంది. దీంతో ఆమె తల్లి ఆందోళన చెందుతోంది. గురువారం ఉదయం స్కూల్ వెళ్తున్నానని చెప్పి వెళ్లిన ఆ బాలిక స్కూల్ కు చేరుకోలేదు. ఈ విషయం తెలిసినా తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

గురువారం ఉదయం నుంచి తన  కూతురు అదితి కనిపించడం లేదని ఆమె తల్లి సౌమ్య వాపోయింది. పాఠశాలకు వెళ్లేందుకు వెళ్లిన ఆమె అక్కడికి చేరుకోలేదు. గ్రాండ్ వ్యూ నుంచి హెరిటేజ్ హైస్కూల్ వరకు ఎవరైనా మీ ఇంటిని దాటిందో లేదో చూడటానికి వారి కెమెరాలను తనిఖీ చేయగలరని కోరింది.   అదితి సాధారణంగా గ్రాండ్ వ్యూ నుంచి బాక్స్ ఎల్డర్ హిల్ క్రెస్ట్ వరకు నడుస్తుంది. వీధి గుండా డీర్ క్రీక్ మార్గంలో పాఠశాలకు వెళుతుంది. అలా వెళ్లిన బాలిక అదితి స్కూల్ కు చేరుకోలేదు. దీంతో స్కూల్ నిర్వాహకులు తమకు సమాచారం అందించారని, ఆమె మిస్సింగ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. అయితే అదితి వద్ద ఫోన్ కూడా లేదన్నారు. ఆమె ఆచూకీ తెలిసిన వారు సమాచారం అందిస్తే తగిన పారితోషికం అందిస్తామని సౌమ్య ప్రకటించింది. అదితి ఆచూకీ దొరికితే వెంటనే దయచేసి  7025047092 ఫోన్ నంబర్ లో  సంప్రదించాలని వేడుకుంది.

కాగా, అదితి మిస్సింగ్ కు కారణాలు తెలియరాలేదు. ఆమె తనకు తానే అదృశ్యమైందా..ఎవరైనా అగంతకులు కిడ్నాప్ చేశారా అనే సమాచారం లేదు. అయితే అదితి ఆచూకీ తెలిసిన వారు వెంటనే సమాచారం అందించాలని ఆమె తల్లి సౌమ్య సూచించింది.  

Exit mobile version