CM Yogi Adityanath : భారత బౌలర్ మహమ్మద్ షమీ. వరల్డ్ కప్ లో అదరగొడుతున్నాడు. వికెట్లు తీయడంలో ముందుంటున్నాడు. తనదైన శైలిలో ప్రదర్శన చేస్తున్నాడు. ఈ సీజన్ లోనే బెస్ట్ బౌలర్ గా గుర్తింపు పొందాడు. అతడి నైపుణ్యానికి అందరు మంత్రముగ్దులవుతున్నారు. టీమిండియాకు దొరికిన మరో ఆణిముత్యంలా అభివర్ణిస్తున్నారు. దీంతో మహమ్మద్ షమికి ప్రశంసల వెల్లువ కొనసాగుతోంది.
షమి పుట్టింది యూపీలో. దీంతో అతడి జ్ణాపకార్థం ఓ స్టేడియం నిర్మిస్తున్నారు సీఎం ఆదిత్యనాథ్. ఈనేపథ్యంలో షమి లాంటి మరికొందరు క్రీడాకారులను తయారు చేయాలనే ఉద్దేశంతో క్రీడాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వమే దీన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తోంది. దీని కోసం గ్రామాధికారి, డెవలప్ మెంట్ అధికారులు స్థలాన్ని గుర్తించి పనులు చేసేందుకు సిద్ధమయ్యారు.
ఎవరైనా క్రీడాకారులు బాగా ఆడితే వారిపేరు మీద అవార్డు ఇవ్వడమో లేక ఇల్లు కొనివ్వడమే స్థలం ఇవ్వడమో చేస్తుంటారు. షమీ కోసం క్రీడా ప్రాంగణమే నిర్మించడానికి యోగి ప్రభుత్వం తీసుకున్ని నిర్ణయం అందరిలో ప్రశంసలు కురిపిస్తోంది. ఓ ఆటగాడి కోసం సీఎం తీసుకున్న నిర్ణయం బాగుందని కితాబిస్తున్నారు. ఎవరో చెప్పే బదులు ముందే ఊహించి నిర్ణయం తీసుకోవడం యోగికే చెల్లుతుంది.
ఇలా షమీ లాంటి క్రీడాకారులను దేశానికి అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒకే మ్యాచ్ లో ఏడు వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బ కొట్టడంలో షమీ ఆటతీరు అద్భుతం. వికెట్లు తీయడంలో అందెవేసిన చేయిగా తయారయ్యాడు. దీంతో టీమిండియాకు లభించిన మరో మంచి బౌలర్ గా కీర్తించబడుతున్నాడు. ఒక్కో మ్యాచ్ లో తనదైన శైలిలో బౌలింగ్ చేస్తూ అందరి అంచనాలు నిజం చేస్తున్నాడు. అతడిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాడు.