Lok Sabha Elections 2024 : దేశవ్యాప్తంగా తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈరోజు 21 రాష్ట్రాల్లో 102 స్థానాలకు ఓటింగ్ నిర్వహించారు. పశ్చిమ బెంగాల్ లో సాయంత్రం 5 గంటల గంటల వరకు 77.57 శాతం ఓటింగ్ నమోదైంది. ఈరోజు జరిగిన మొదటి దశ పోలింగ్ లో ఇదే అత్యధికమని ఎన్నికల అధికారులు ప్రకటించారు.
కొన్ని రాష్ట్రాల్లో చెదురుమదురు సంఘటనలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచి ఎండలు తీవ్రంగా ఉన్నా ప్రజలు ఓటు వేసేందుకు బారులుదీరారు. పోలింగ్ కేంద్రాలు ఓటర్లతో నిండిపోయాయి. పలు రాష్ట్రాల్లో మధ్యాహ్నం 3 గంటల వరకే 50 శాతం పోలింగ్ జరిగినట్లు ఈసి ప్రకటించింది. అత్యధికంగా ఈశాన్య రాష్ట్రం త్రిపురలో పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత మణిపూర్, మేఘాలయ, అస్సాంలో ఎక్కువ మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకున్నారు. రెండో విడత పోలింగ్ ఈనెల 16న జరగనుంది. ఆ రోజున 13 రాష్ట్రాల్లోని 89 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు.