Loksabha Elections 2024 : దేశవ్యాప్తంగా తొలి దశ పోలింగ్ నేడు ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 7 దశల్లో జరిగే లోక్ సభ పోలింగ్ తొలి దశ ఇవాళ జరుగుతోంది. మొత్తం 21 రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీల్లో 102 ఎంపీ స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. ఇందులో 73, జనరల్, 11 ఎస్టీ, 18 ఎస్సీ లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.
ఆయా స్థానాల్లో 1,625 మంది పోటీలో ఉన్నారు. మొత్తం 16.63 కోట్ల మంది (8.23 కోట్ల మంది మహిళలు, 8.4 కోట్ల మంది పురుషులు, ఇతరులు 11,371) ఓటు వేయనున్నారు. 20 నుంచి 29 ఏళ్ల వయస్సున్న వారి సంఖ్య 3.51 కోట్లుగా ఉంది. ఇక ఎన్నికల కోసం 1.87 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. విధుల్లో 18 లక్షల మంది అధికారులు, సిబ్బంది పాల్గంటున్నారు.