JAISW News Telugu

BJP Lok Sabha Candidates : బీజేపీ లోక్ సభ అభ్యర్థుల తొలిజాబితా విడుదల.. తెలంగాణలో వీరికి ఛాన్స్..

BJP Lok Sabha Candidates

BJP Lok Sabha Candidates

BJP Lok Sabha Candidates : బీజేపీకి చెందిన లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల అయింది. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యా లయంలో పార్టీ ముఖ్యనేతలు ప్రెస్‌మీట్ నిర్వహిం చారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా 125 మందితో ఫస్ట్ లిస్ట్ విడుదల చేశారు. తెలంగాణలో సికింద్రాబాద్ నుంచి కిషన్‌రెడ్డి బరిలో నిలువగా.. కరీంనగర్ నుంచి బండి సంజయ్ పోటీలో ఉన్నా రు. ఇక నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్ కు టికెట్ ఖరారు చేసింది అధిష్టానం.

బీజేపీకి చెందిన లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల అయింది. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాల యంలో పార్టీ ముఖ్యనేతలు ప్రెస్‌మీట్ నిర్వహిం చారు. బీజేపీ జనరల్ సెక్రటరీ వినోద్ తావడే 195 మందితో ఫస్ట్ లిస్ట్ విడుదల చేశారు. తెలంగాణలో 9 మందికి చోటు కల్పించారు. సికింద్రాబాద్ నుంచి కిషన్‌రెడ్డి బరిలో నిలువగా.. కరీంనగర్ నుంచి బండి సంజయ్ పోటీలో ఉన్నారు.

ఇక నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్ కు టికెట్ ఖరారు చేసింది అధిష్టానం. అలాగే జాతీయ స్థాయిలో వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేయనున్నారు. ఇక లక్నో పార్లమెంట్ నియోజకవర్గంలో మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్ బరిలో నిలువగా.. గాంధీనగర్‌ నుంచి అమిత్‌ షా పోటీ చేయనున్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీ మూడవ సారి అధికారంలోకి రావాలని తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. 380 లోక్ సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. తొలి జాబితాలో 34 మంత్రులు, ఇద్దరు సీఎంలకు అవకాశం కల్పించారు.

28 మంది మహిళలకు అవకాశం ఇవ్వగా.. 47 మంది యువతకు ఛాన్స్ ఇచ్చారు. అలాగే 27 మంది ఎస్సీ, 17 ఎస్టీ సామాజిక వర్గానికి కేటాయించగా.. 57 మంది ఓబీసీలకు అవకాశం కల్పించారు. విదిశ నుంచి మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ లోక్‌సభ బరిలో నిలుచోను న్నారు. భోపాల్ ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్‌కు ఈసారి టికెట్ ఇవ్వలేదు బీజేపీ అధిష్టానం. 2019 ఎన్నిక ల్లో కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్‌ను సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఓడించారు. దేశవ్యాప్తంగా 90 – 100 మంది సిట్టింగ్ ఎంపీలకు టికెట్లు నిరాకరించింది. మూడు పర్యాయాలు ఎంపీలుగా చేసినవారికి, వయస్సు పైబడినవారికి కోత విధించింది. కొత్త తరానికి, పార్టీ కోసం శ్రమించినవారికి చోటు కల్పిస్తూ అభ్యర్థుల కూర్పుపై కసరత్తు చేసింది. అయితే తెలంగాణ నుంచి ముగ్గురు సిట్టింగ్‌లకు తొలి జాబితాలో స్థానం కల్పించడం గమనార్హం.

Exit mobile version