Sajjala Bhargava : ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో గత ప్రభుత్వం చేసిన అక్రమాలు, అన్యాయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలు గతలో రెచ్చిపోయారు. ప్రభుత్వం ధనాన్ని అడ్డగోలుగా వాడుకున్నారు. అవన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి. అధికారం అండగా విపక్ష నాయకుల పై అడ్డగోలు ప్రచారాలకు తెరలేపారు. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరి బండారాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే గత సర్కార్ ప్రజాధనాన్ని అడ్డగోలుగా మేసేసిన వ్యవహారంలో సజ్జల భార్గవపై మొదటి కేసు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. డిజిటల్ కార్పొరేషన్ పేరుతో వైసీపీ సోషల్ మీడియా వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని గుటకాయ స్వాహా చేసిందని బయటపడింది. దీనిపై విచారణ జరిపించేందుకు ప్రభుత్వం సిద్ధం అయింది. డిజిటల్ కార్పొరేషన్ పేరుతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరిట వేల కోట్ల రూపాయలు చెల్లింపు చేశారు. వీరంతా జగన్మోహన్ రెడ్డి పార్టీ కోసం పని చేశారు. పైకి మాత్రమే కార్పొరేషన్.. చేసిందంతా దోపిడీనేనని.. ప్రజల సొమ్ముతో సోషల్ మీడియాలో వైఎస్సార్ సీపీ కోసం పని చేశారని తెలుస్తోంది.
సమాచార శాఖలో బయటకొస్తున్న కుంభకోణాలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. విచారణ జరపాలంటూ మంత్రులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా త్వరలో సంబంధిత వ్యక్తుల పై కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. జడ్జిలపై తప్పుడు వ్యాఖ్యలు చేసి అరెస్టయిన వారికి కూడా లక్షల్లో జీతాలు ముట్టజెప్పారు. బెయిల్ పై వచ్చిన తర్వాత కూడా వారికి పెద్ద ఎత్తున జీతాలు ఇచ్చారు. పాన్ దుకాణాలు నడుపుకునేవారికి చివరికి.. ఇటీవల టీడీపీ నేతలు దాడి చేశారని ఆరోపణలు చేసిన పాలేటి రాజ్ కుమార్ ఆయన భార్యకు కూడా జీతాలు చెల్లించినట్లు అరోపణలు వస్తున్నాయి. ఇలా జీతాలు తీసుకున్న వారంతా చేసేది బూతుల దాడే. అంతా సజ్జల భార్గవ నేతృత్వంలో జరుగుతుందని తేలింది. చివరికి వారి పాపం పండి కేసులు నమోదు చేసే పరిస్థితి వచ్చింది. దీంతో సజ్జల భార్గవ ఆజ్ఞాతంలోకి వెళ్లి పోయాడని చెబుతున్నారు. అయితే ఎక్కడికి వెళ్లినా తండ్రితో పాటు కొడుకును వదలరని హెచ్చరికలు వినిపిస్తున్నాయి.