Jammu and Kashmir : జమ్మూకశ్మీర్ లో తుది విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభం
Jammu and Kashmir : జమ్మూకశ్మీర్ శాసనసభ ఎన్నికల సమరంలో చివరి విడత పోలింగ్ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. జమ్మూ ప్రాంతంలో 24, కాశ్మీర్ లోయలో 16 కలిపి మొత్తం 40 స్థానాల్లో బరిలో ఉన్న 415 మంది అభ్యర్థుల భవితను 39.18 లక్షల మంది ఓటర్లు తేల్చనున్నారు. 5,060 పోలింగ్ కేంద్రాల్లో దాదాపు 20 వేల మంది సిబ్బంది ఎన్నిక విధుల్లో పాల్గొంటున్నారు. 370 రాజ్యాంగ అధికరంణం రద్దయిన తర్వాత ఓటుహక్కు పొందిన పశ్చిమ పాకిస్థాన్ శరణార్థులు, వాల్మీకి సమాజ్, గూర్ఖా తెగల వారు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయబోతున్నారు.
ఈ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ తో కాంగ్రెస్ పార్టీ జతకట్టింది. బీజేపీ, పీపుల్ డెమొక్రటిక్ ఫ్రంట్ (పీడీపీ) పార్టీలు ఒంటరిగా బరిలో నిలిచాయి. మరోవైపు లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడిలో హిజుబొల్లా నేత నస్రల్లా మృతి చెందారు. అందుకు నిరసనగా కాశ్మీర్ లో ఇటీవల నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఈ తుది విడత పోలింగ్ వేళ భారీ కట్టుదిట్టమైన భద్రతను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.