Fim Industry-Pawan : 2014 లో ప్రముఖ తెలుగు సినీ నటుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ప్రారంభించారు. కానీ అప్పటి ఎన్నికల్లో ఆయన పార్టీ తరపున నాయకులు అసెంబ్లీకి గాని, పార్లమెంట్ కు గాని పోటీ చేయలేదు. ఆ తరువాత 2019 లో వచ్చిన ఎన్నికల్లో బరిలో నిలిచారు పార్టీ అభ్యర్థులు బరిలో నిలిచారు. కానీ జనసేన అధినేత ఆశించిన ఫలితం రాలేదు. ఆ ఎన్నికల్లో ఒక నటుడిగా రాజకీయ రంగంలో ప్రవేశం చేస్తే సినీ పరిశ్రమ అండగా నిలవాలి. కానీ పలు రాజకీయ సమీకరణాల నేపథ్యంలో సినీ ఇండస్ట్రీ పవన్ కళ్యాణ్ పార్టీకి దూరంగా నిలబడింది.
2019 నాటికీ కూడా టీడీపీ అధికారంలో ఉంది. ఆ తరువాత వైసీపీ అధికారం చేపట్టింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎం హోదాలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి సినీ పరిశ్రమను దూరం పెట్టారు. పరిశ్రమ పెద్దలు జగన్ కు ఎంత దగ్గరగా వస్తే, సీఎం జగన్ అంత దూరం జరిగిన సందర్భాలు ఉన్నవి. సినీ పరిశ్రమ సమస్యలు పరిష్కరించక పోయిన ఫరవాలేదు. కానీ మానసికంగా, వ్యక్తిగతంగా, ఆర్థికంగా ఇబ్బందులు పెట్టడం జరిగింది. దింతో పరిశ్రమలోని నటులు, సాంకేతిక నిపుణులు, దర్శక నిర్మాతలు జగన్ బాధితుల లిస్టులో చేరారు.
ప్రముఖ నటుడు మోహన్ బాబు కు చెందిన విద్యాసంస్థలో చదివే విద్యార్థులకు ఫీ రీఎంబర్స్మెంట్ మంజూరు చేయకపోవడంతో విద్యార్థులు ఆర్థికంగా నష్టపోయారు. సంస్థ కూడా మానసికంగా ఇబ్బందులను ఎదుర్కొంది. అదేవిదంగా అవార్డు గ్రహీత చిరంజీవి ఇటీవల మాట్లాడుతూ సీఎం ను మర్యాదపూర్వకంగా కలవడానికి వెళితే అవమానాలు ఎదురైనాయి. గతంలో ఏ సీఎం కూడా నటులను అవమానించలేదు.ఎంతో గౌరవించారు. ప్రముఖ నటుడు నాగార్జున ఖమ్మం లో వ్యవసాయ భూమి కొనుగోలు చేసుకుంటే బలవంతంగా తీసుకున్నాడు. జగన్ పరిపాలనలో తిరుమల దేవస్థానం అపవిత్రమైపోయిందని నటుడు పృద్విరాజ్ బాహాటంగానే ఆవేదన వ్యక్తం చేశారు.
బాహుబలి సినిమాతో తెలుగు పరిశ్రమ ఘనతను ప్రపంచానికే చాటిచెప్పిన దర్శకుడు రాజమౌళిని పదిమందిలో అవమానించిన సీఎం గ నిలిచిపోయారని సినీ పరిశ్రమ కోడైకూసింది. నటుడు రామ్ పోతినేని కుటుంబ సభ్యులకు చెందిన రమేష్ హాస్పిటల్ లో విద్యుత్ ప్రమాదం జరిగితే దానికి రాజకీయ రంగు పూసి ఇబ్బందులకు గురిచేసారు. పవన్ కళ్యాణ్ కోసం దర్శకుడు త్రివిక్రమ్ పాట రాసినందుకు వైసీపీ నేతలు బూతులు, తిట్లతో ఆయన్ని ఇబ్బందుల పాలుచేశారు. తెలుగుదేశం పార్టీలో బీసీ లకు ఎంతో గౌరవం ఉంది. ఆ పార్టీనే గెలిపించాలని నటుడు నిఖిల్ యాదవ్ ఓటర్లను కోరుతున్నారు. ప్రజా నాయకుడిగా చిత్ర పరిశ్రమకు మేలు చేయకపోయినా ఫరవాలేదు, కానీ ఇబ్బందులకు గురిచేయడం ఏమిటనే బాధతోనే తామంతా కూడా మా నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అండగా ఉండి గెలిపించుకుంటామని చిత్రపరిశ్రమ నటులు, సాంకేతిక వర్గం, పెట్టుబడిదారులు ప్రకటించారు.