JAISW News Telugu

YS Jagan : జగన్ ను వెంటాడుతున్న భయం.. మొఖంలో చిరునవ్వు, ధీమా మాయం

YS Jagan

YS Jagan

YS Jagan : కక్కలేక మింగలేక అన్నట్టు ఉంది ఇప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పరిస్థితి.   మొన్నటి వరకు 175 సీట్లు మావే అంటూ ధీమాగా చెప్పారు జగన్మోహన్‌ రెడ్డి. చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైల్లో వేసినప్పుడు తెగ సంబరపడిపోయాడు. టిడిపి, జనసేన ఇంకా ఎన్ని పార్టీలు కట్టకట్టుకువచ్చినా సింహం సింగిల్ గానే వస్తుందని… సింహాన్ని ఎవరూ ఓడించలేరన్నారు.  ఎన్నికల నగారా మోగిన తర్వాత తాను అభిమన్యుడుని కాదు.. అర్జునుడినని పద్మవ్యూహం చెందించడం ఎలాగో తనకు బాగా తెలుసంటూ చెప్పుకొచ్చారు. తను తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు మరే నాయకుడు తేలేదని గుడ్డి నమ్మకం ఏర్పాటు చేసుకున్నారు.  రాష్ట్రంలో 99 శాతం మందికి తన పథకాలతో మేలు చేసినందు వల్లే తన గెలుపు తథ్యమన్న ధీమా నెలకొంది.  

పైన దేవుడు,  ప్రజల ‘షల్లని దీవెనలు’ తనకే ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. ఎందుకో గానీ జగన్‌ నోట ఇప్పుడు ఆ 175 సీట్ల ఊసే లేదు. మొఖంలో ఆనాటి చిరునవ్వులే కనిపించడం లేదు.   ‘షల్లని దీవెనలు’ ఉన్నా జగన్‌ ప్రస్తుతం ప్రచార సభల్లో  ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు. ఈ ఎన్నికలు సజావుగా జరుగుతాయనే నమ్మకం లేదంటు అనుమాన పడుతున్నారు. చంద్రబాబు నాయుడు కేంద్రానికి చాడీలు చెప్పి పోలీస్ ఉన్నతాధికారులందరినీ తప్పిస్తున్నారని ఆరోపిస్తున్నారు.  చంద్రబాబు కుట్రలతో సంక్షేమ పథకాలన్నిటినీ ఆపించేస్తున్నడని జగన్ మండిపడుతున్నాడు.  అసలు ఏపీలో తాను ఉండకుండా చేయాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారంటూ  ఆరోపించారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి తెలుసుకోకుండా, ప్రధాని  మోడీ కూడా చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ, తనను, తన ప్రభుత్వాన్ని నానామాటలు అంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

నిజానికి వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను, ఇన్‌చార్జిలను మార్చిననాడే జగన్‌కు భయం మొదలైంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో ప్రతిపక్షాలపై జరుగుతున్న భౌతిక దాడులను గమనిస్తే ఓటమి భయంతోనే  చేస్తున్నట్లు స్పష్టమైంది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, టీడీపీ, జనసేన నేతలు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు రాష్ట్రంలోని పోలీస్ అధికారుల తీరుపై అభ్యంతరం చెపుతూ ఫిర్యాదులు చేశారన్న సంగతి వైసీపీకి కూడా తెలుసు. అసలు తమ ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకే చంద్రబాబు, బీజేపీతో  కూటమి కట్టారన్న సంగతి కూడా జగన్‌కు తెలుసు. కనుక ఇటువంటి ఘటనలు జరిగితే ఈసీ కఠిన చర్యలు తీసుకుంటుందని  వైసీపీకి తెలుసు. అయినా వైసీపి డీఎన్ఏలో అరాచక ఆలోచనలు, లక్షణాలను ఇప్పటికిప్పుడు మార్చుకోలేదు. కనుక ఎప్పటిలాగే చెలరేగిపోయింది. ఏపీలో  తీవ్ర అరాచక పరిస్థితులు నెలకొని ఉన్నాయని ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇద్దరూ చెప్పారు.

ఇంత జరిగిన తర్వాత కూడా ఈసీ ఇంకా కళ్లు మూసుకుని కూర్చుంటుందని జగన్‌ భావించడం అవివేకమే ?   తెలంగాణలో కేసీఆర్‌లాగా జగన్‌ కూడా పోలీస్ ఉన్నతాధికారులను చెప్పు చేతల్లో పెట్టుకుని ఎలక్షన్లను తనకు అనుకూలంగా మార్చుకోవాలని భావించాడు. సరిగా  పోలింగ్‌కు ముందు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ వేటు వేసింది. ఇది జగన్‌ ప్రభుత్వానికి పెద్ద షాక్ . మరోపక్క చంద్రబాబు ‘ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌’ అనే బ్రహ్మాస్త్రాన్ని జగన్‌పైకి సంధించారు. వైసీపీ ఓటమికి అదొక్కటే చాలనిపిస్తోంది. ఈ ఎన్నికలలో కూడా కేసీఆర్‌ తనకు తోడుగా ఉంటాడనుకుంటే  ఆయన చేతులు ఎత్తేశారు.  అందుకే ఈ ఎన్నికలలో ఓడిపోబోతున్నామనే ఆక్రోశమే జగన్‌ మాటల్లో వినిపిస్తోందిప్పుడు. ఈ విషయం ఒప్పుకోలేక, బయటకు చెప్పుకోలేక ఈసీని, మోడీని కూడా తప్పు పడుతున్నాడు జగన్.

Exit mobile version