Rohit Sharma : మనదేశంలో క్రికెట్ అంటే పిచ్చి. అభిమానులు ఎక్కువే. దీంతో క్రికెట్ ఆట అంటే ఎంతో ఆసక్తి పెంచుకోవడం సహజమే. క్రికెట్ ఆట ఉందంటే టీవీలకే అతుక్కుపోతుంటారు. అది ఐపీఎల్ అయినా, వన్డే అయినా, టెస్ట్ అయినా ఏ రకమైన ఆటైనా అభిమానులు ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు. క్రికెట్ ను ఆస్వాదిస్తుంటారు. బాల్ బాల్ కు గమ్మత్తుగా ఫీలవుతూ ఉంటారు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ముంబయి ఇండియన్స్ ప్లేయర్. రోహిత్ కు ఫాలోవర్స్ కూడా ఎక్కువే. అతడి ఆటను ముచ్చటగా చూస్తుంటారు. రోహిత్ కు ఫ్యాన్ బేస్ మాములుగా ఉండదు. ఎక్కడికి వెళ్లినా రోహిత్.. రోహిత్ అంటూ గోల గోల చేస్తుంటారు. ప్రస్తుతం ఆయన క్రేజ్ మరింత పెరిగింది. ఇక ముంబై ఇండియన్స్ రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తప్పించి పాండ్యాకు అప్పగించడంతో అభిమానుల్లో ఆయనపై సింపతీ బాగా పెరిగింది. దీంతో ముంబై ఇండియన్స్ జట్టును, హార్దిక్ పాండ్యాను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ జట్టు ఆడే మ్యాచ్ ల్లో రోహిత్ నినాదాలు తప్ప వేరే వినపడడం లేదు.
రాజస్థాన్, ముంబయి ఇండియన్స్ మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ తన వెనక నుంచి ఓ అభిమాని రావడంతో భయపడ్డాడు. కాస్త వెనక్కి జరిగి అతడికి హగ్ ఇచ్చాడు. దీంతో ఆ అభిమాని సంతోషానికి అవధులు లేవు.
తరువాత అతడు పక్కనే ఉన్న కీపర్ ఇషాన్ కిషన్ ను కూడా హగ్ చేసుకున్నాడు. భద్రతా సిబ్బంది వచ్చి అతడిని బయటకు తీసుకెళ్లారు. ఇలా అప్పుడప్పుడు అభిమానులు ఇలాంటి చర్యలకు దిగడం కామనే. అది వారిలో ఉన్న అభిమానమే. దీంతో మైదానంలో ఉన్న క్రీడాకారులు భయపడటం కూడా సహజమే. అభిమానం మనసులో ఉంచుకోవాలి కానీ ఇలా మైదానంలోకి వెళితేనే కష్టం.
ఇలాంటి ఘటనలు ఇంతకుముందు కూడా జరిగాయి. ఆట ఆడే సందర్భంలో అభిమానులు ఇలా అకస్మాత్తుగా రావడంతో ఆటగాళ్లు ఖంగుతింటున్నారు. ఇక్కడ రోహిత్ శర్మ కోసం ఫ్యాన్ పరుగెత్తుకు రావడంతో అందరు ఆశ్చర్యపోయారు. మొత్తానికి అతడిని బయటకు పంపేయడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. అంత వరకు అందరిలో టెన్షన్ పట్టుకుంది.