Lord Shiva : 6 గ్యారంటీలకు దరఖాస్తు చేసుకున్న మహాశివుని కుటుంబం.. తెలంగాణలో అద్భుతం!

lord shiva application form for congress 6 gurantees

lord shiva application form for congress 6 gurantees

Lord Shiva : తెలంగాణ లో అధికారం లోకి వచ్చే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు హామీలను ఇచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. వీటిలో ప్రజలకు ఏ హామీ అందడం లేదో, ఆ హామీని నెరవేర్చడం కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని కాంగ్రెస్ చేపట్టిన కార్యక్రమం ప్రజా పాలన. గత నెల 28 వ తారీఖున  చేప్పట్టిన ఈ కార్యక్రమం, ఎట్టకేలకు నిన్నటితో పూర్తి అయ్యింది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఈ పది రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా కోటి 30 లక్షల అప్లికేషన్లు వచ్చాయని, ప్రజా పాలన కార్యక్రమానికి అద్భుతమైన ఆదరణ దక్కిందని, అప్లికేషన్ ఫామ్స్ గడువు తేదీ అయిపోయిందని లబ్ధిదారులు చింతించాల్సిన అవసరం లేదని, మీ సమీపం లో ఉన్న ఎమ్మార్వో ఆఫీసులలో అప్లికేషన్ ఫామ్స్ ఉంటాయని. దరఖాస్తు చెయ్యాలనుకున్న వాళ్ళు అక్కడ చేసుకోవచ్చు, దీనికి ప్రత్యేక నోడల్ అధికారుల బృందాన్ని కూడా ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చాడు సీఎం.

ఇదంతా పక్కన పెడితే హన్మకొండ జిల్లాలో ఒక విచిత్రమైన అనుభవం అధికారులకు ఎదురైంది. హన్మకొండ జిల్లాలోని భీమదేవరపల్లి మండలం, ముత్తారం గ్రామం లో ఏకంగా పరమశివుడి పేరిట ఆరు గ్యారంటీలను కోరుతూ దరఖాస్తు చేసారు. అప్లికేషన్ ఫామ్ లో ఫోటో కూడా శివుని ఫోటోనే అప్లోడ్ చెయ్యడం విశేషం. ఇక క్రింద కుటుంబ సభ్యుల వివరాలు విభాగం లో భార్య పేరు పార్వతి, పెద్ద కొడుకు పేరు కుమారస్వామి, చిన్న కొడుకు పేరు వినాయకుడు అని రాసి ఉంది. దీనిని గమనించిన అధికారులు ఒక్కసారిగా కంగు తిన్నారు. దేవుడు అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చెయ్యడం ఏమిటి?, కొంతమంది ఆకతాయిలు కావాలని ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చేసాడు. అనవసరం గా ఒక అప్లికేషన్ ఫామ్ వేస్ట్ అయ్యింది, ఇది అవసరమైన వాళ్లకు దొరికి ఉంటే ఎంతో బాగుండేది.

అప్లికేషన్స్ కోసం గంటలతరబడి క్యూ లైన్స్ లో చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు తీసుకుంటున్నారు. అంత విలువైన ఫామ్ గా జనాలు భావిస్తున్న ఈ నేపథ్యం లో ఇలాంటి చిల్లర ఆటలు ఆడుతున్నారు కొంతమంది ఆకతాయిలు, ఇంకా ఇలాంటివి ఎన్ని ఉన్నాయో అంటూ అధికారులు పెదవి విరుస్తున్నారు. ప్రస్తుతం ఈ అప్లికేషన్ ఫామ్ సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ట్రోలింగ్స్ కూడా మామూలు రేంజ్ లో జరగడం లేదు.

TAGS