JAISW News Telugu

Kangana Ranaut : కంగనా చెంపపై కొట్టిన ఉద్యోగిని ట్రాన్స్ ఫర్.. పోస్ట్ వైరల్..

Kangana Ranaut

CISF – Kangana Ranaut

Kangana Ranaut : సినీ నటి, బీజేపీ ఎంపీ కంగాన రౌనత్ ను చండీగఢ్ విమానాశ్రయంలో  సీఐఎస్‌ఎఫ్ (CISF) మహిళా అధికారి కుల్విందర్ కౌర్ కొన్ని వారాల క్రితం చెంపపై కొట్టింది. ఈ వార్త దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ సమయంలో అధికారులు ఆమెపై చర్యలు తీసుకున్నారు. కుల్విండర్ కౌర్ ను కర్ణాటకకు బదిలీ చేశారన్న వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు ఆమెకు మద్దతిస్తుండగా.. మరి కొందరు వ్యతిరేకిస్తున్నారు.

దేశ వ్యాప్తంగా వైరల్ అవుతున్న పోస్ట్
చండీగఢ్ విమానాశ్రయంలో జరిగిన ఈ అనూహ్య ఘటనపై తర్వాత ఎక్స్ లో కంగనా స్పందించారు. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలు, బీజేపీ నేతలు, అభిమానులు నిరసనలు తెలిపారు. రైతులు ఉద్యమం చేస్తున్న సమయంలో కంగనా అనుచిత వ్యాఖ్యల వల్లే ఇదంతా జరిగిందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత భద్రతా ఉల్లంఘన ఆరోపణపై CISF మహిళా సైనికురాలు కౌర్ ను ఉద్యోగం నుంచి తొలగించారు. ఆ తర్వాత ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

కుల్విందర్ ట్రాన్స్‌ఫర్..?
కుల్వీందర్ కౌర్‌ కేసును పైఅధికారులు పెండింగ్‌లో ఉంచారు. కానీ, రెండు రోజులుగా తిరిగి డ్యూటీలో చేరినట్లు సమాచారం అందుతోంది. అయితే చండీగఢ్ లో కాకుండా బెంగళూర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో బదిలీ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు ఆమె భర్తను కూడా ట్రాన్స్ ఫర్ చేశారనే టాక్ వినిపిస్తోంది.

అన్నీ తప్పుడు వార్తలే..
తనపై వస్తున్న తప్పుడు వార్తలపై కుల్విందర్ స్పందించారు. ఈ ఫేక్ న్యూస్ గురించి ఆమె మాట్లాడుతూ ఇదంతా ఫేక్ న్యూస్ అని చెప్పింది. తనను అధికారులు సస్పెండ్ చేశారని, ఆ రోజు నుంచి ఇప్పటి వరకు సస్పెన్షన్ లోనే ఉన్నానని ఆమె వెల్లడించింది.

విచారణ తర్వాతే..
కుల్విందర్ కౌర్‌పై విచారణ కొనసాగుతోంది. ఇది ముగిసే వరకు కుల్విందర్ ను డ్యూటీలోకి తీసుకోవడం కుదరదు. అలాంటప్పుడు ఆమె ట్రాన్స్ ఫర్ అంటూ వచ్చిన వార్తలు అవాస్తవం అని తెలుస్తోంది. కంగనాపై దాడి చేసిన కుల్విందర్ కౌర్ ఇక తర్వాత ఉద్యోగంలో కొనసాగుతారా? లేదంటే తొలగిస్తారా? అనేది విచారణ పూర్తయితే గానీ తేలనుంది. 

Exit mobile version