Lal Salaam Vs Eagle : సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే తమిళ సినిమా..తమిళ సినిమా అంటే రజినీకాంత్..ఆయన ఆడిందే ఆట, పాడిందే పాట, తీసిందే సినిమా అన్నట్టుగా తమిళ ప్రజలు భావిస్తారు. అందుకే నాలుగు దశాబ్దాలుగా తమిళ సినిమా ఇండస్ట్రీ లోనే కాదు, సౌత్ లోనే నెంబర్ 1 బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా కొనసాగుతూ వస్తున్నాడు. కానీ ఎంత పెద్ద సూపర్ స్టార్ కి అయినా ఒక వయస్సు వచ్చిన తర్వాత బాక్స్ ఆఫీస్ స్టామినా తగ్గుతుంది.
రజినీకాంత్ కి కూడా ‘జైలర్’ కి ముందు వరుస ఫ్లాప్స్ వల్ల కాస్త క్రేజ్ తగ్గింది. జైలర్ చిత్రానికి కూడా రికార్డు స్థాయి వసూళ్లు లాంగ్ రన్ లో వచ్చాయి కానీ, మొదటి రోజు మాత్రం తమిళనాడు లో ఆల్ టైం రికార్డుని నెలకొల్పలేకపోయింది. నాన్ రజినీ రికార్డ్స్ అని పిలవబడే స్థాయి నుండి ఇలా డౌన్ అయిపోవడం ఆయన అభిమానులకు కాస్త మింగుడు పడని విషయమే అని చెప్పొచ్చు.
కానీ ఆయన గత చిత్రం ‘జైలర్’ సినిమా 650 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది. ఈ సినిమా వసూళ్లను సౌత్ లో నేటి తరం బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ గా చలామణి అవుతున్న ప్రభాస్, విజయ్ లాంటి వాళ్ళు క్రేజీ కాంబినేషన్స్ తో వచ్చి కూడా జైలర్ రికార్డ్స్ ని బ్రేక్ చేయలేకపోయారు. దీంతో అందరూ సూపర్ స్టార్ స్టామినా బ్యాక్ అయ్యిందని అనుకున్నారు. కానీ నేడు విడుదలైన ‘లాల్ సలాం’ చిత్రం ఓపెనింగ్స్ చూస్తే, ఒకప్పటి రజినీకాంత్ బాక్స్ ఆఫీస్ స్టామినా ఇంకా తిరిగి రాలేదు అనే విషయం అర్థం అవుతుంది. ఈరోజు విడుదలైన ‘లాల్ సలాం’ అనే చిత్రం లో సూపర్ స్టార్ రజినీకాంత్ కేవలం ముఖ్య పాత్ర మాత్రమే పోషించాడు. విష్ణు విశాల్, విక్రాంత్ లు హీరోలుగా నటించగా, రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించింది.
రజినీకాంత్ కేవలం ముఖ్య పాత్ర పోషించాడు కాబట్టే ఈ సినిమాకి అనుకున్న రేంజ్ వసూళ్లు లేవని అంటున్నారు ఆయన ఫ్యాన్స్. కానీ గత ఏడాది పవన్ కళ్యాణ్ ‘బ్రో’ సినిమాలో కూడా అలాంటి పాత్రనే చేసాడు, ఆ సినిమాకి ఓపెనింగ్స్ అదిరిపోయాయి కదా, లాల్ సలాం కి ఏమైంది? అని ట్రేడ్ పండితులు ప్రశ్నిస్తున్నారు. నేడు విడుదలైన రవితేజ ‘ఈగల్’ చిత్రానికి గంటకి 10 వేల టిక్కెట్లు ఆన్లైన్ లో అమ్ముడుపోతుంటే, లాల్ సలాం చిత్రానికి కేవలం నాలుగు వేల టిక్కెట్లు మాత్రమే అమ్ముడుపోతున్నాయి, దీనికి బట్టీ అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ ఓపెనింగ్స్ వచ్చాయో.