Heart attack : డ్రైవర్ కు గుండెపోటు.. పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

Heart attack RTC Driver
Heart attack : డ్రైవర్ కు గుండెపోటు రావడంతో ఆర్టీసీ బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. బాపట్ల జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు రేపల్లె నుంచి చీరాల వెళ్తుండగా.. కర్లపాలెం వద్ద ఒక్కసారిగా డ్రైవర్ సాంబశివరావుకు గుండెపోటు వచ్చింది. బస్సు వేగాన్ని తగ్గించడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్ సాంబశివరావు మృతి చెందాడు. బస్సు అదుపు తప్పే సమయంలో సైకిల్ ను ఢీకొట్టడంతో ఒకరికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు.