
Doctor forgot needle in Women Head
Doctor forgot needle Women Head : ఓ యువతి తలలో సూదిని మర్చిపోయిన డాక్టర్ అలాగే కుట్లేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. యూపీలోని హాపూర్ కు చెందిన పద్దెనిమిదేళ్ల యువతిపై కొందరు దాడికి దిగడంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. దీంతో ఆమె ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు వెళ్లగా పరీక్షించిన వైద్యుడు తలకు కుట్లు వేసి పంపారు.
ఇంటికి వెళ్లిన అనంతరం యువతికి తీవ్రంగా తలనొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆమెను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు యువతికి చికిత్స చేస్తుండగా తలలో సర్జికల్ సూది కనబడడంతో కంగుతున్నారు. వెంటనే దానిని తొలగించి, కుట్లు వేశారు. దీంతో బాధితులు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. చికిత్స చేస్తున్న సమయంలో వైద్యుడు మద్య మత్తులో ఉన్నందు వల్లే హాపూర్ జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సునీల్ త్యాగి ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. ఘటనపై విచారణకు ఆదేశించామని, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.