మహారాష్ట్రలో ఎన్డీఏ పార్టీల సీట్ల పంపకం ఖరారు

Maharashtra

Maharashtra Politics

Maharashtra : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎలక్షన్ కమిషన్ నేడు ప్రకటించనుంది. ఇక్కడ ఉమ్మడిగా పోటీ చేయనున్న బీజేపీ, శివసేన(షిండేవర్గం) ఎన్సీపీ(అజిత్ పవార్ వర్గం)లకు సంబంధించి సీట్ల పంపకం ఖరారైంది.  ఇందులో భారతీయ జనతా పార్టీ  150 కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయనున్నది. మిత్ర పక్షాలను సంప్రదిచాకే ఈ నిర్ణయం తీసుకున్నారు.

150కి పైగా స్థానాల్లో బరిలో బీజేపీ
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే మిత్రపక్షాల మధ్య సీట్ల పంపకం దాదాపు ఖరారైంది. ఇక్కడ బీజేపీ 150కి పైగా స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇతర స్థానాలను ఏక్‌నాథ్ షిండేకు చెందిన శివసేన, అజిత్ పవార్‌కు చెందిన ఎన్‌సీపీ పంచుకోనుున్నాయి. ఈ కూటమిలో బీజేపీ ప్రధాన పాత్రను పోషిస్తుండగా, శివసేన రెండో స్థానంలో, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ మూడో స్థానంలో ఉన్నాయి.

 మొత్తం 288 స్థానాలకు వ్యూహరచన  
మహారాష్ట్ర కోర్ కమిటీ మారథాన్ సమావేశం సోమవారం మధ్యాహ్నం 2.30 నుండి రాత్రి 8 గంటల వరకు హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగింది. మొత్తం 288 స్థానాలకు వ్యూహరచన చేశారు. అభ్యర్థులను ఎంపికలో అన్ని అంశాలను బేరీబు వేసుకున్నారు .ఇప్పుడు అభ్యర్థుల తొలి జాబితాపై అక్టోబర్ 16న ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో చర్చించనున్నారు. దాదాపు మెజార్టీ సిట్టింగ్ స్థానాలకు అభ్యర్థులను తొలి జాబితాలోనే ప్రకటించే అవకాశం ఉంది.

ప్రధాన సీట్లలో శివసేన, ఎన్సీపీ అభ్యర్థులు
బిజెపి, శివసేన (షిండే వర్గం), ఎన్‌సిపి (అజిత్ పవార్ వర్గం) మధ్య ఈ సీట్ల పంపకం మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారనుంది. ఈ పార్టీల బలప్రదర్శన మీదే అధికారం నిర్ణయం కానుంది. ఇందులో భాగంగా శివసేన, ఎన్సీపీలకు ప్రధాన స్థానాల్లో సీట్లు కేటాయింనున్నారు. మహారాష్ట్రలోని మిత్రపక్షాల సహకారంతో బీజేపీ ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేస్తోందని, ఇందులో అన్ని పార్టీల మధ్య సమతూకం కొనసాగించే ప్రయత్నం జరిగిందని ఈ సీట్ల పంపకం స్పష్టం చేస్తోంది.

TAGS