JAISW News Telugu

Trinadha Rao : హీరోయిన్ నాకు హగ్గు ఇవ్వలేదు అంటూ ఏడ్చేసిన ధమాకా డైరెక్టర్!

Dhamaka director Trinadha Rao statements viral

Dhamaka director Trinadha Rao statements viral

Trinadha Rao : సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి పెద్ద హీరోయిన్స్ అవుదామని కొంతమంది అమ్మాయిలకు ఆశ ఉండొచ్చు. కానీ ఇండస్ట్రీ లో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా తల్లి తండ్రులు తమ ఆడపిల్లల్ని సినిమాల్లోకి పంపడానికి భయపడుతూ ఉంటారు. కొన్ని కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే అది నిజమే కదా అని అనిపిస్తుంది. రీసెంట్ గా ధమాకా దర్శకుడు త్రినాథరావు నక్కిన , నిర్మాతగా మారి ‘నక్కిన క్రియేషన్స్’ పై ‘చౌర్య పాఠం’ అనే సినిమా తెరకెక్కింది.

ఈ సినిమాకి సంబంధించిన టీజర్ నిన్ననే ఒక ఈవెంట్ ని ఏర్పాటు చేసి విడుదల చేసారు మూవీ టీం. ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీ కి  హీరో హీరోయిన్ల దగ్గర నుండి, డైరెక్టర్ వరకు అంత కొత్తవాళ్లు పరిచయం అవుతున్నారు. ఈ సినిమా లో హీరోయిన్ గా నటించిన అమ్మాయి పేరు పాయల్ రాధా కృష్ణ. ఈమె తెలుగు అమ్మాయి, కానీ బెంగళూరు లో స్థిరపడింది, తెలుగు అనర్గళంగా మాట్లాడగలదు.

అయితే హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ గురించి త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ చేసిన కొన్ని చిలిపి చేష్టలు చూసేందుకు ఆడియన్స్ కి చాలా అసహ్యంగా అనిపించింది. సోషల్ మీడియా లో ఇప్పుడు దానికి గురించి పెద్ద చర్చనే నడుస్తుంది. ఇంతకీ ఆయన ఏమి మాట్లాడాడంటే ‘ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అమ్మాయి పేరు పాయల్ రాధాకృష్ణ, తెలుగు అమ్మాయే కానీ బెంగళూరు లో స్థిరపడింది. ఈ అమ్మాయి సెట్స్ లో ఉన్న వాళ్లందరికీ దగ్గరకి వెళ్లి మరీ హగ్గులు ఇచ్చింది, కానీ నాకు మాత్రం ఇవ్వలేదు. నోరు తెరిచి హగ్గు కావాలన్నా కూడా ఇవ్వడం లేదు, ఏమి ఒక్క హగ్గు ఇస్తే నీ సొమ్ము ఏమైనా అరిగిపోతాడా, తరగిపోతాడా అని అడిగినా కూడా ఇవ్వలేదు’ అని అనగా, అప్పుడు పాయల్ రాధా థాంక్యూ సార్ అని షేక్ హ్యాండ్ ఇవ్వబోతాది. అప్పుడు నక్కిన మాట్లాడుతూ ‘చూసారా హగ్గులు ఇవ్వమంటే షేక్ హ్యాండ్ ఇస్తుంది.

అమ్మాయిలను నమ్ముకుంటే చివరికి హ్యాండ్ మాత్రమే ఇస్తారు, హగ్గులు ఇవ్వరు’ అంటూ చెప్పుకొచ్చాడు. అప్పుడు హీరోయిన్ మరోసారి థాంక్యూ సార్ అని చెప్పి గట్టిగా హాగ్ చేసుకుంటుంది.  అప్పుడు నక్కిన మాట్లాడుతూ ‘చూసారా ఎలాంటి హాగ్ వచ్చిందో, సూపర్ గా ఉంది’ అంటూ కామెంట్ చేసాడు. అందరూ చూస్తుంది స్టేజి మీదనే ఇన్ని వేషాలు వేసుంటే, ఇక షూటింగ్స్ సెట్స్ లో ఎలాంటి వేషాలు వేసి ఉంటాడో అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version