Radhika Apte : ఆ డైరెక్టర్ రాత్రికి వస్తావా అని అడిగాడు.. హీరోయిన్ రాధికా ఆప్టే సంచలనం..!

Radhika Apte

Radhika Apte

Radhika Apte : మీటూ ఉద్యమం తర్వాత హీరోయిన్లు ఒక్కొక్కరుగా నోరు విప్పుతున్నారు. తమకు గతంలో జరిగిన అనుభవాలను పంచుకుంటూ ముందుకు వస్తున్నారు. మీటూ ఉద్యమంకు ముందు ఎవరూ పెద్దగా ఇలాంటి వాటి మీద స్పందించలేదు. కేవలం తమ  కెరీర్ గురించి మాత్రమే మాట్లాడేవారు. కానీ ఇప్పుడు మాత్రం అందరూ తమకు జరిగిన చేదు అనుభవవాల గురించి మాట్లాడుతున్నారు.

ఇక తాజాగా రాధికా ఆప్టే కూడా ఈ లిస్టులోకి వచ్చి చేరిపోయింది. ఆమె గురించి సౌత్ నుంచి నార్త్ వరకు బాగా తెలుసు ప్రేక్షకులకు. ఎందుకంటే ఆమె ఎన్నో సినిమాల్లో నటించింది. చిన్న హీరోల దగ్గరి నుంచి మొదలు పెడితే సీనియర్ హీరోల దాకా ఆమె జోడీ కట్టింది. ఇక వ్యక్తిగతంగా ఆమె ఎప్పటికప్పుడు సంచలన కామెంట్లు చేస్తూనే ఉంటుంది.

ఆమె తాజాగా మరోసారి ఇలాంటి కామెంట్లు చేసి అందరి దృష్టిలో పడింది. ఆమె తాజాగా మాట్లాడుతూ.. నేను సౌత్ ఇండస్ట్రీలో అలాగే బాలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాల్లో నటించాను. కానీ సౌత్ లో కంటే బాలీవుడ్ లోనే ఎక్కువగా కాస్టింగ్ కౌచ్ కు గురయ్యాను నేను. ఓ డైరెక్టర్ అయితే నాతో చాలా అసభ్యకరంగా మాట్లాడి ఇబ్బంది పెట్టాడని తెలిపింది ఈ బ్యూటీ.

ఆ డైరెక్టర్ నాకు సినిమాలో ఛాన్స్ ఇస్తానంటూ ఆడిషన్స్ కోసం ఓ రోజు అతని రూమ్ కు వెళ్లాను. కానీ అతను మాత్రం అక్కడ ఆడిషన్ చేయలేదు. మనం రాత్రి చేద్దాం.. నువ్వు నా గెస్ట్ హౌస్ కు వచ్చెయ్ అంటూ అన్నాడు. దానికి నాకు చాలా అనుమానం కలిగింది. అందుకే ఆ రోజు రాత్రి అతని రూమ్ కు వెళ్లలేకపోయాను అంటూ రాధికా ఆప్టే చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

TAGS