Destruction : ప్రపంచ వినాశనం వారి చేతుల్లోనే.. ఒక్క బటన్ నొక్కితే చాలు..
అణ్వాయుధాల నిర్వహణ అనేది అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ. ఇందుకోసం ఆయా దేశాలు వివిధ వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాయి. సాధారణంగా వీటి నియంత్రణ సైనిక అధికారుల చేతుల్లో ఉంటుంది. ఇందుకోసం వివిధ భద్రతా వ్యవస్థలు ఏర్పాటు చేయబడతాయి. తద్వారా అంత ఈజీగా ఈ ఆయుధాలను ప్రయోగించలేరు. ఒకరి చేతుల్లోనే వీటి పర్యవేక్షణ ఉంటే మానవాళికి ముప్పు కలిగే అవకాశం ఉంటుంది. అణ్వాయుధాల నియంత్రణకు ప్రపంచ దేశాలు ఒక ప్రత్యేకమైన, కఠినమైన చట్టాలను ఏర్పాటు చేసుకున్నాయి.
యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా అతిపెద్ద అణ్వాయుధ దేశం. ఇక్కడ వీటి నియంత్రణ బాధ్యత అధ్యక్షుడి చేతుల్లో ఉంటుంది. ఇక రష్యా కూడా అత్యంత శక్తిమంతమైన అణ్వాయుధాలను కలిగి ఉన్నది. ఇక్కడ కూడా నియంత్రణ బాధ్యత అధ్యక్షుడిపై ఉంటుంది. చైనాలో కూడా నియంత్రణ బాధ్యత అధ్యక్షుడి చేతుల్లో ఉంటుంది. భారతదేశం అణు విధానం నోఫస్ట్ యూజ్ అనే నిబంధనను ఏర్పాటు చేసుకున్నది. భారత ప్రధాని వద్ద వీటి నియంత్రణ విభాగం ఉంటుంది. ఇక పాకిస్థాన్ అణు శక్తి నియంత్రణ పాకిస్థాన్ ప్రధానమంత్రి, రక్షణ మంత్రిపై ఉంటుంది. పాకిస్థాన్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ అధ్యక్షుడు, ప్రధాని, సైనిక చీఫ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఇక యుకేలో అణ్వాయుధాలు భారీ సంఖ్యలో ఉన్నాయి. వీటి ప్రయోగం ఆదేశాలు ప్రధానమంత్రికి మాత్రమే ఉంటాయి. అయితే, పార్లమెంటు ఆమోదం తప్పనిసరి. ఫ్రాన్స్ లో అణ్యాయుధాల నియంత్రణ బాధ్యత అధ్యక్షుడికి మాత్రమే ఉంటుంది. ముందుగా నిర్ధిష్ట సైనిక అధికారి, జాతీయ రక్షణ అధికారితో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.