rajinikanth : రజినీకాంత్ సినిమాకు తగ్గుతున్న కలెక్షన్లు… నిర్మాతలు చేసిన పనికి అంటూ ఆరోపణలు
rajinikanth : రజినీకాంత్ సినిమా రిలీజ్ అవుతుందంటే తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో వేచి చూసేవారు. జైలర్ సినిమా తెలుగులో ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. జైలర్ సినిమాకు 45 కోట్లు ఫ్రీ రిలీజ్ ప్రీమియర్ షోలు ఇతర కలెక్షన్ ద్వారా వసూలు అయ్యాయి.
రజనీకాంత్ కు తమిళ ఇండస్ట్రీలో ఏ విధంగా కలెక్షన్స్ వస్తాయో తెలుగులో కూడా అదే స్థాయిలో సినిమా వసూళ్లు రాబడుతుంది.
శివాజీ సినిమాకు కూడా ఇలాగే కలెక్షన్లను రాబట్టింది. ఆ తర్వాత కబాలి ఇలా ఏ సినిమా విడుదలైనా రజనీకాంత్ కు తమిళంలో ఏ స్థాయిలో అయితే కలెక్షన్స్ వసూలు ఉంటుందో తెలుగులో కూడా అలాంటి భారీ కలెక్షన్లు ఆయన సినిమాలు సాధిస్తాయి.
అయితే తాజాగా రజనీకాంత్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది వెట్టియాన్ అనే మూవీతో రజనీకాంత్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేసేందుకు ఆ చిత్రం నిర్మాతలు రెడీ అయ్యారు. కాగా వెట్టియాన్ సినిమాకు తెలుగులో పేరు పెట్టలేదు. డైరెక్ట్ గా తమిళ పేరును తీసుకున్నారు. దీంతో ఆ సినిమా కలెక్షన్లు పడిపోతున్నట్టు అర్థమవుతుంది. ఇప్పటికీ కేవలం 9 కోట్లు మాత్రమే వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఇంకా సినిమా రిలీజ్ కాకముందే ఫ్రీ బుకింగ్స్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ ద్వారా ఈ తొమ్మిది కోట్లు కలెక్ట్ అయినట్టు తెలుస్తుంది.
అయితే రజనీకాంత్ సినీ చరిత్రలో తెలుగులో ఎంత తక్కువగా కలెక్ట్ చేసిన సినిమా మరి ఏదీ లేదని తెలుస్తోంది. ఇప్పటికే రజనీకాంత్ కు చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఇంత ఫ్యాన్ బేస్ ఉన్నప్పటికీ కూడా తెలుగులో ఇంత తక్కువ కలెక్షన్లు రావడం అనేది కాస్త ఆలోచించాల్సిన విషయమే. రజనీకాంత్ ఇప్పటికే ఎన్నో సినిమాల్లో తన రికార్డులను తానే బ్రేక్ చేసుకుని ప్రభంజనం సృష్టిస్తున్నారు. అలాంటి రజనీకాంత్ సినిమాకు కేవలం 9 కోట్లు అది తెలుగులో ఫ్రీ బుకింగ్ షోస్ ద్వారా రావడం అనేది చాలా తక్కువ అని చెప్పొచ్చు. దీనికి అంతటికి కారణం ఆ చిత్ర నిర్మాత ఫిల్మ్ మేకర్స్ అని అభిమానులు కోప్పడుతున్నారు.