Star Hero Daughter : స్టార్ హీరో కూతురు మృతి.. తరలివస్తున్న సినీ లోకం

Star Hero Daughter, Rajendra Prasad Daughter Gayathri
Star hero daughter Died : స్టార్ హీరో రాజేంద్రప్రసాద్ కూతురు ఈ రోజు ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. కాగా రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి ప్రేమించి పెళ్లి చేసుకుంది. దీంతో రాజేంద్రప్రసాద్ ఆమెతో చాలా రోజుల నుంచి మాట్లాడడం మానేశాడు అని సమాచారం. ఒకానొక సందర్భంలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ తన కూతురు గాయత్రి ఒకరిని ప్రేమించింది. తను చెప్పిన వినకుండా అతనితో పెళ్లి చేసుకుంది. దీంతో ఆమెతో నేను మాట్లాడడం మానేశాను.
నా పది సంవత్సరాల వయసులోనే తల్లిని కోల్పోయాను. ఆ సమయంలో తాను పడిన బాధ ఎవరికి తెలియకుండా తన కూతురి రూపంలో తల్లిని చూసుకున్నాను. కానీ చివరికి ఆమె తాను చెప్పిన మాట వినకుండా ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో ఆ బాధ తట్టుకోలేక ఆమెతో మాట్లాడటం మానేశానని రాజేంద్రప్రసాద్ అన్నారు. కాగా ఈ రోజు ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి కన్నుమూశారు. నిన్న మధ్యాహ్నం అస్వస్థతకు గురైన గాయత్రిని ఆసుపత్రికి తరలించగా ఈరోజు ఉదయం కన్నుమూసింది.
గాయత్రి వయసు 35 సంవత్సరాలు ఉంటుందని ఇంత చిన్న వయసులోనే ఆమెకు గుండెపోటు రావడం చాలా బాధాకరమని ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రాజేంద్రప్రసాద్ ని పరామర్శించడానికి సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు తరలివస్తున్నారు. ఇంత చిన్న వయసులో గాయత్రి మరణించడం చాలా బాధాకరమని ఆయన్ని ఓదార్చుతున్నారు. కాగా గాయత్రి కూతురు రాజేంద్రప్రసాద్ మనమరాలు శ్వేత మహానటి సినిమాలో సావిత్రి క్యారెక్టర్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. గాయత్రి కి కూడా సినిమా రంగంపై ఇష్టం ఉందని తెలుస్తుంది.
అందుకే తన కూతురుని సావిత్రి క్యారెక్టర్ లో నటింపజేసేందుకు గాయత్రి ముందుకు వచ్చింది. కాగా గాయత్రి ఆకస్మిక మరణంతో రాజేంద్రప్రసాద్ కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. రాజేంద్ర ప్రసాద్ ని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు.