Star Hero : తమ నటనతో తమకంటూ ప్రత్యేకతను చాటుకున్న నటులు ఎందరో ఉన్నారు. తన సినిమాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాడు. ఆ హీరో సినిమా విడుదలవుతున్నదంటే రెండు రోజుల ముందు నుంచే థియేటర్లలో ప్రేక్షకులు టికెట్ల కోసం క్యూలో నిల్చునేవారు. అది ఆ స్టార్ హీరో రేంజ్. హీరోగానే కాకుండా వయసు మళ్లిన పాత్రల్లోనూ నటించి మెప్పించాడు.
సంజీవ్ కుమార్ జూలై 9, 1938న గుజరాత్‌లోని సూరత్‌లో జన్మించారు. చిన్న వయస్సులో ముంబైకి చేరాడు. 1960లో హమ్ హిందుస్తానీ సినిమాతో కెరీర్‌ని ప్రారంభించాడు. ఆ తర్వాత నిషాన్, ఛోటీ సి ములాఖత్, ఆశీర్వాద్, సంఘర్ష్, సాథీ, అనోఖి రాత్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించాడు. 1970 దశకంలో మరింత పాపులారిటీ సంపాదించాడు. అతని నటనకు జనాలు ఫిదా అయ్యేవారు. ఆ ఏడాది ఆయన నటించిన బొమ్మ, దేవి, దస్తక్, బచ్‌పన్ చిత్రాలు విడుదలయ్యాయి. దస్తక్ చిత్రానికి గాను జాతీయ అవార్డు కూడా అందుకున్నాడు.
గొప్ప పాత్రలతో అలరించి..
ప్రతి సినిమాలో ఒకదానికొకటి సంబంధం లేకుండా భిన్నమైన క్యారెక్టర్లతో అలరించాడు. అప్పటి స్టార్ హీరో దిలీప్ కుమార్ సైతం సంజీవ్ కుమార్ నటనను మెచ్చుకోలేకుండా ఉండలేకపోయాడు. అయితే ఈ నటుడు కేవలం 47 ఏళ్లకే చనిపోయాడు.
50 ఏళ్లకే మృత్యువాత
అయితే ఈ కుటుంబంలో ఎవరూ 50 ఏళ్లకు మించి బతకడం లేదట. సంజీవ్ కుమార్‌తో పాటు వాళ్ల తాత, తండ్రి, తమ్ముడు నికుల్‌తో సహా ఆ కుటుంబంలోని పురుషులందరూ 50 ఏళ్లు నిండకముందే చనిపోయారు. సంజీవ్ కుమార్ బతికున్నప్పుడు ఇదే విషయమై ఓ ఇంటర్వ్యూలో అడిగారట. వయసు మళ్లిన పాత్రలు చేయడానికి ఏదైనా కారణం ఉందా అని అడిగారట. సంజయ్ కుమార్ అప్పుడు చెప్పిన ఆన్సర్ తర్వాత నిజం కావడంతో షాక్ కు గురయ్యారు. తాను నా వృద్ధాప్యాన్ని ఎప్పటికీ చూడలేను. అందుకే తాను వయసు మళ్లిన పాత్రలు చేస్తున్నానని బదులిచ్చాడట.